Budhaditya yoga 2023: ఆగష్టు 17న సూర్యుడు సింహరాశిలో సంచారం చేశాడు. అయితే ఇంతకముందే అదే రాశిలోకి బుధుడు సంచారం చేశాడు. ఈ రెండు గ్రహాల కలయికల కారణంగా ప్రత్యేక యోగం ఏర్పడింది. ఈ క్రమంలో ఏర్పడే బుధాదిత్య యోగం కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడింది. దీంతో ఆ రాశులవారికి కీర్తితో పాటు శ్రేయస్సు పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో బుధాదిత్య యోగానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఇది వ్యక్తుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ యోగం కారణంగా ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పడు మనం తెలుసుకుందాం.
బుధాదిత్య యోగంతో ఈ రాశులవారి జీవితాల్లో మార్పులు:
మేష రాశి:
ఈ యోగం మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వీరు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తి జీవితాన్ని గడిపేవారికి పేరు ప్రఖ్యాతులు రెట్టింపు అవుతాయి. వ్యాపారస్తులు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారు యోగం సమయంలో మొదలు పెడితే మంచి లాభాలు కలుగుతాయి.
ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ యోగం కారణంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త వనరులు ఏర్పడి ఊహించని డబ్బును పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారాలు చేసేవారు గతంలో పెట్టుబడిన పెట్టుబడులు ఈ సమయలో రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబంతో ప్రత్యేకంగా గడిపే సమయం కూడా ఏర్పడుతుంది.
తులారాశి:
ఈ ప్రత్యేక యోగం కారణంగా తులారాశివారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం కారణంగా మీ జీవితంలో సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. చేతి వృత్తులను నమ్ముకున్నవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో మీ సీనియర్లు మీ పనిని చూసి ఆకట్టుకుంటారు. అంతేకాకుండా సులభంగా మీరు రుణాన్ని తిరిగి చెల్లిస్తారు.
ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి