Budhaditya Yoga 2023: ఆగస్టు 17న (ఈ రోజు) గ్రహాల రాజు సూర్యుడు తన సొంత రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. సూర్యుడు సింహ రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇదే రాశిలో ఇప్పటికే బుధు కూడా సంచార దశలో ఉన్నాడు. దీంతో సూర్య, బుధ గ్రహాలు కలవబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శుభప్రదమైన బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు భారీ లాభాలు పొందుతారు. అంతేకాకుండా భవిష్యత్‌లో కూడా మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ బుధాదిత్య యోగం కారణంగా ఏయే రాశులవారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారు బుధాదిత్య యోగం కారణంగా భారీ లాభాలు పొందుతారు:
మేషరాశి:
బుధాదిత్య యోగం మేష రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు. ఇరక ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం సరైనదిగా చెప్పవచ్చు. ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో కష్టపడి పనులు చేయడం వల్ల సులభంగా ప్రమోషన్స్ పొందుతారు. అంతేకాకుండా ఆదాయంలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఖర్చులు తగ్గి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీరు కుటుంబంతో ఆనందకరంగా గడుపుతారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
కర్కాటక రాశి:
ఆగస్టు 17 నుంచి బుధాదిత్య యోగం కారణంగా కర్కాటక రాశివారికి శుభ సమయం ప్రారంభం కాబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు. ఇక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ బుధాదిత్య యోగం సమయంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపార రంగంలో మంచి పేరుపొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.
తులరాశి:
బుధాదిత్య యోగం తులరాశి వారికి కూడా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. వీరు జీవితంలో సానుకూల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆదాయంలో కూడా మార్పులు వస్తాయి. ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో ఖర్చులు పూర్తిగా తగ్గి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రుణాలు తీసుకున్నవారు కూడా ఈ క్రమంలో సులభంగా తిరిగి చెల్లిస్తారు. ఉద్యోగాలు చేసేవారు కష్టపడి పని చేయడం వల్ల పని దగ్గ ప్రతిఫలం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి