Chandra Grahan 2023: చంద్ర గ్రహణం ఎప్పుడు.. ఈ సమయంలో చేయకూడని పనులేంటి?

Lunar eclipse 2023: వచ్చే నెల 05వ తేదీన ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరం  మెదుటి చంద్రగ్రహణం ఎప్పుడు, ఎక్కడ ఏర్పడుతుందో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2023, 12:58 PM IST
Chandra Grahan 2023: చంద్ర గ్రహణం ఎప్పుడు.. ఈ సమయంలో చేయకూడని పనులేంటి?

Chandra Grahan 2023 date: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం వచ్చే నెలలో ఏర్పడనుంది. చంద్రుడు మరియు సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ గ్రహణ సమయంలో ఎటువంటి పనులు జరగవు. ఈ సంవత్సరం మెుదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుందో తెలుసుకుందాం. 

చంద్రగ్రహణం 2023 తేదీ 
ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 5, శుక్రవారం, రాత్రి 08.45 గంటలకు 2023న సంభవించబోతుంది. ఇది మే 6 మధ్యాహ్నం 1 గంటలకు ఉంటుంది. ఇదే రోజున బుద్ధ పూర్ణిమ కూడా జరుపుకుంటారు. ఇప్పుడు ఏర్పడబోయేది పెనుంబ్రల్ చంద్ర గ్రహణం. ఈ చంద్రగ్రహణం ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మరియు అంటార్కిటికాలో కనిపిస్తుంది. ఈ ఎక్లిప్స్ ఇండియాలో కనిపించదు. జ్యోతిష్య పండితుల ప్రకారం, భారతదేశంలో సూతకం కాలం చెల్లదు.

Also Read: Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ నాడు ఏ టైంలో బంగారం కొంటే మంచిది? 

ఈ విషయాలను గుర్తుంచుకోండి..
** చంద్రగ్రహణం సమయంలో ఆహారం వండడం లేదా తినడం నిషేధమని జ్యోతిష్యశాస్త్రంలో చెప్పబడింది. అలాగే ఈ సమయంలో ఎలాంటి పూజలు లేదా మతపరమైన పనులను ప్రారంభించడం అశుభకరంగా భావిస్తారు.
** చంద్రగ్రహణం సమయంలో నిద్రపోకూడదు. ఈ సమయంలో భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే ఈ సమయంలో గర్భిణులు ఇంటి నుంచి బయటకు రాకూడదు. అంతేకాకుండా పదునైన వస్తువులు వాడకూడదు.  
** గ్రహణం సమయంలో ఆలయ తలుపులు మూసివేయాలి. అంతేకాకుండా చెట్లను మరియు మొక్కలను తాకకూడదు. 

Also Read: Guru Gochar 2023: మరో 24 గంటల్లో వీరి జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News