Lunar Eclipse 2022: చంద్ర గ్రహణం తేదీ, సమయం ఎప్పుడు, దీపావళిపై చంద్ర గ్రహణ ప్రభావముంటుందా

Lunar Eclipse 2022: దీపావళికి పదిహేను రోజుల తరువాత ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మరి సూతకకాలం ఎప్పుడుంది, దీపావళిపై ప్రభావం ఎలా ఉండనుందనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 6, 2022, 05:26 PM IST
Lunar Eclipse 2022: చంద్ర గ్రహణం తేదీ, సమయం ఎప్పుడు, దీపావళిపై చంద్ర గ్రహణ ప్రభావముంటుందా

Lunar Eclipse 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహణానికి విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహణం విషయంలో హిందూమతంలో చాలా నియమాలున్నాయి. శాస్త్రాల ప్రకారం ఇదొక అశుభ ఘటన. పూజాది కార్యక్రమాలు, శుభ కార్యాలేవీ ఈ సమయంలో జరపరు. ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం గురించి ఇతర వివరాలు పరిశీలిద్దాం..

ఈ ఏడాది అంటే 2022లో మొత్తం 4 గ్రహణాలున్నాయి. రెండు గ్రహణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో రెండు మిగిలున్నాయి. సూర్య గ్రహణానికి సరిగ్గా 15 రోజుల తరువాత చంద్ర గ్రహణముంది. ఈసారి సూర్య గ్రహణం సరిగ్గా దీపావళి పండుగ నాడు సంభవిస్తోంది. దీపావళికి 15 రోజుల తరువాత చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలివే.

ఈసారి దీపావళి అక్టోబర్ 25వ తేదీన ఉంది. సరిగ్గా 15 రోజుల తరువాత దేవ దీపావళి రోజున అంటే నవంబర్ 8వ తేదీన చంద్ర గ్రహణం ఏర్పడనుంది. సూర్య గ్రహణం ఎప్పుడూ అమావాస్యనాడు, చంద్ర గ్రహణం ఎప్పుడూ పౌర్ణిమ నాడు వస్తుంటాయి. చంద్రగ్రహణ సూతక కాలానికి ముందే దేవ దీపావళి నిర్వహిస్తారు. అందుకే పండితులు చెప్పినదాని ప్రకారం దేవ దీపావళి ఒకరోజు ముందు నవంబర్ 7వ తేదీన ఉంటుంది. 

చంద్ర గ్రహణం సమయం

2022లో రెండవ, చివరి చంద్ర గ్రహణం ఇండియాలో కన్పించనుంది. ఆ సమయం నవంబర్ 8 మద్యాహ్నం 1 గంట 32 నిమిషాల్నించి సాయంత్రం 7 గంటల 27 నిమిషాలవరకూ ఉంటుంది. 

శాస్త్రవేత్తల ప్రకారం ఈ ఏడాదిలో ఏర్పడనున్న చివరి చంద్ర గ్రహణం ఇండియా సహా దక్షిణ, తూర్పు యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ , హిందూ మహా సముద్రం ప్రాంతాల్లో కన్పించనుంది. 

చంద్ర గ్రహణం సూతక కాలం 9 గంటల ముందే ఉంటుంది. అంటే సూతక కాలం ప్రారంభమవడానికి ముందే దేవ దీపావళి జరుపుకుంటారు. శాస్త్రవేత్తల ప్రకారం చంద్ర గ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో ఉంటాయి. చంద్ర గ్రహణం సందర్భంగా జ్యోతిష్యశాస్త్రంలో చాలా జాగ్రత్తలు పాటించాలని ఉంది. గ్రహణం తరువాత హిందూమతం ప్రకారం దానం, స్నానం చేయాలి. గ్రహణ సమయం అశుభంగా భావిస్తారు. ఇందులో ఏ శుభ కార్యాలు, పూజలు చేయకూడదు. గ్రహణం పూర్తయ్యేవరకూ సూతక కాలముంటుంది. 

చంద్ర గ్రహణం సందర్భంగా గర్భిణీ మహిళలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవ3ాలి. ఈ సమయంలో భగవంతుడిని స్మరించుకుంటూ ఉండాలి. ఏ పని చేయకూడదు. సూతక కాలం ప్రారంభమయ్యాక..పూజాది కార్యక్రమాలు చేయకూడదు. ప్రయాణం, నిద్రించడం చేయకూడదు. 

Also read: Shani Margi 2022: ప్రత్యక్ష సంచారంలోకి శనిదేవుడు...ధంతేరాస్ నుండి ఈ రాశులకు లక్కే లక్కు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News