Pitru Dosham Remedies: మీ జాతకంలో పితృ దోషం ఉందా? అయితే అమావాస్య నాడు ఇలా చేయండి..

Pitru Dosh Remedy: జాతకంలో పితృ దోషం ఉండటం వల్ల మనిషి అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. పితృ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆస్ట్రాలజీలో అనేక చిట్కాలు చెప్పబడ్డాయి.     

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2022, 05:10 PM IST
Pitru Dosham Remedies: మీ జాతకంలో పితృ దోషం ఉందా? అయితే అమావాస్య నాడు ఇలా చేయండి..

Pitru Dosham Remedies: పితృ పక్షం మెుదలైంది. ఈ సమయంలో ప్రజలు చనిపోయిన పూర్వీకుల శాంతి కోసం శ్రాద్ధం చేస్తారు. దీంతో పూర్వీకుల సంతోషించి ఆశీర్వాచనాలు వారిపై కురిపిస్తారు. దీంతో వారి ఇంట్లో ఆనందం, సంతోషం, ఐశ్వర్యం నెలకొంటాయి. అయితే కొంత మంది జాతకంలో పితృ దోషం (Pitru Dosham) ఉంటుంది. దీంతో వారు అనేక కష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈ దోషం ముఖ్యంగా రాహువు వల్ల ఏర్పడుతుంది. అయితే కుండలిలో పితృ దోషం ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. పితృ పక్ష సమయంలో కొన్ని  చర్యలు తీసుకోవడం ద్వారా ఈ దోషం నుండి బయటపడవచ్చు. 

జాతకంలో పితృ దోషం ఉంటే...
జాతకంలోని పితృ దోషం గత జన్మలో చేసిన కర్మల వల్ల కూడా రావచ్చు. తల్లిదండ్రులకు సేవ చేయకపోవడం లేదా వారి పట్ల నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా పితృ దోషం ఏర్పడుతుంది. ఎవరి జాతకంలో అయితే పితృ దోషం ఉంటుందో ఆ వ్యక్తి పురోగతి సాధించలేడు. అతను అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. దీంతో అతడు మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా వీరు ఎంత కష్టపడి పనిచేసినా వారి వద్ద డబ్బు నిలువదు. దీని ప్రభావం ఫ్యామిలీ లైఫ్ కూడా పడుతుంది. 

పితృ దోషాన్ని పోగొట్టే మార్గాలు..
జాతకంలో పితృ దోషం వదిలించుకోవడానికి ఆస్ట్రాలజీలో అనేక మార్గాలు చెప్పబడ్డాయి. దీని నుండి బయటపడాలంటే అమావాస్య రోజున పేదవాడికి ఖీర్ ను తినిపించండి. అదే విధంగా రావిచెట్టును నాటడం, దానిని సంరక్షించడం కూడా పితృ దోష ప్రభావాన్ని తగ్గిస్తుంది. ప్రతి రోజు ఉదయం భగవద్గీత చదవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఇంట్లోని పూజా స్థలంలో ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించండి.

Also Read: Indira Ekadashi 2022: ఇందిర ఏకాదశి వ్రతం ఎప్పుడు? ఈ వ్రత విశిష్టత ఏంటి? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News