Ratha Saptami 2024: రేపు రథ సప్తమి నాడు ఈ ఒక్కపని చేస్తే మీ కెరీర రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుందట..!

Ratha Saptami 2024 Remedy: హిందూ క్యాలెండర్ ప్రకారం రథ సప్తమి లేదా అచల సప్తమి ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తేదీన జరుపుకుంటారు. ఈ రోజు సూర్య భగవానుడి పుట్టినరోజు. రథసప్తమి నాడు ఉపవాసం ఉండడం వల్ల అన్ని రోగాలు నయమవుతాయి.

Written by - Renuka Godugu | Last Updated : Feb 15, 2024, 07:59 AM IST
Ratha Saptami 2024: రేపు రథ సప్తమి నాడు ఈ ఒక్కపని చేస్తే మీ కెరీర రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుందట..!

Ratha Saptami 2024 Remedy: హిందూ క్యాలెండర్ ప్రకారం రథ సప్తమి లేదా అచల సప్తమి ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తేదీన జరుపుకుంటారు. ఈ రోజు సూర్య భగవానుడి పుట్టినరోజు. రథసప్తమి నాడు ఉపవాసం ఉండడం వల్ల అన్ని రోగాలు నయమవుతాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. జాతకంలో సూర్యుడు బలపడి శుభ ఫలితాలను ఇస్తాడు. రథ సప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్య నారాయణుడిని పూజించాలి. అర్ఘ్యం సమర్పించాలి. ఈ సంవత్సరం రథసప్తమి రేపు 2024 ఫిబ్రవరి 16న జరుపుకుంటారు. 

1. రథసప్తమి లేదా అచల సప్తమి రోజున స్నానం చేసి పూజ చేసిన తర్వాత, పేద బ్రాహ్మణుడికి పప్పు, బెల్లం, గోధుమలు, ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు దానం చేయండి. దీనివల్ల జాతకంలో సూర్యుడు బలపడి శుభ ఫలితాలను ఇస్తాడు. 

2. రథసప్తమి రోజున ఉపవాసం ఉండండి. ఉప్పు తినవద్దు. అయితే ఈ రోజున ఉప్పును దానం చేయండి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహంతో శారీరక బాధలు తగ్గుతాయి. 

ఇదీ చదవండి: ముస్లిం దేశమైన యూఏఈలో తొలి హిందూ దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా?

3. కెరీర్‌లో విజయాన్ని పొందడానికి రథసప్తమి రోజున ఉదయించే సూర్యునికి నీటిని సమర్పించండి. ఇందుకోసం రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రచందనం, బెల్లం, ఎర్రని పువ్వులు వేసి దానితో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.

4. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ కెరీర్‌లో వేగంగా పురోగతిని పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. 

ఇదీ చదవండి: రేపే వసంతపంచమి.. ఈ రంగు దుస్తులు ధరించి పూజిస్తే లక్ష్మీకటాక్షమే..!

5. వైవాహిక జీవితంలో సంతోషాన్ని పొందడానికి రథసప్తమి లేదా అచల సప్తమి రోజున ఉదయాన్నే స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, పవిత్ర నది లేదా జలాశయంలో నువ్వుల నూనె దీపం వెలిగించి దానం చేయండి. 

6. ఆత్మవిశ్వాసం, ఆనందం, శ్రేయస్సు పొందడానికి రథసప్తమి రోజున స్నానపు నీటిలో ఎర్రచందనం, గంగాజలం, కుంకుమను జోడించి స్నానం చేయండి. దీని వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News