February Born Personality: ఒక వ్యక్తి పుట్టిన నెల వారి కెరీర్ ఎంపిక ,వ్యక్తిత్వం, స్నేహితులు, భాగస్వామిపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతారు. అంతే కాదు, ఆ నెలలో పుట్టిన వారు ఎదుర్కొనే ఆరోగ్య సంబంధిత సమస్యలను తెలుసుకోవచ్చు. జోతిష్యం ప్రకారం వ్యక్తిత్వానికి ,పుట్టిన నెలకు మధ్య సంబంధం ఉంటుంది.
1. ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు ఎప్పటికీ ప్రత్యేకం. నిజానికి, ఈ నెలలో పుట్టినవారు ప్రేమతో నిండి ఉంటారు. చుట్టూ ప్రేమను పంచుకుంటారు. ఫిబ్రవరి లవ్ మంత్, ఈ నెల ప్రారంభం నుంచి మనసులో పాజిటివ్ వైబ్స్ రావడం మొదలవుతుంది. మొత్తానికి ఈనెల అందరికీ ప్రత్యేకం.
2. ఈ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా సృజనాత్మకంగా ఉంటారు. ఎల్లప్పుడూ పనులను విభిన్నంగా చేయడానికి ఇష్టపడతారు. దీంతో వీరికి కీర్తి, పేరుప్రతిష్టలు వస్తాయి.
3. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫిబ్రవరి నెలలో పుట్టినవారు ఇతరుల కంటే జీవితంలో సంపదను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
4. ఫిబ్రవరి నెలలో పుట్టినవారు లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పని చేస్తారు. ఏదైనా సాధించాలని మనసు పెట్టుకుంటే, వాళ్లను ఆపడం కష్టం.
5. ఈ నెలలో పుట్టినవారికి దృఢ సంకల్పం కలిగి ఉంటారు. ఫిబ్రవరి నెలలో పుట్టినవారు ఇతరుల మాటలు వింటారు కానీ స్వంత తెలివితేటలపై ఎక్కువ నమ్మకం ఉంటుంది. వాళ్లు మేధస్సుకు పెట్టిందిపేరు.
6. ఈ నెలలో పుట్టినవారు వినయంగా ఉంటారు. అందుకే ఇతరులకంటే గుంపులో వీరు ప్ర్యతేకంగా కనిపిస్తారు.
7. ఫిబ్రవరి నెలలో పుట్టినవారికి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కుటుంబంలా ఎలా నిర్వహించాలో తెలుసు. ఇతరుల నుంచి ఏమీ ఆశించని వ్యక్తులు ఫిబ్రవరి నెలలో పుట్టినవారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook