Chaturgrahi Yog 2023: ఒకే రాశిలో 4 గ్రహాల కలయిక..ఈ 3 రాశులవారిపై చతుర్గ్రాహి యోగం ఎఫెక్ట్‌..

Chaturgrahi Yog In Tula Rashi: అక్టోబర్ 19న ఒకే రాశిలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడి..వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2023, 09:17 AM IST
Chaturgrahi Yog 2023: ఒకే రాశిలో 4 గ్రహాల కలయిక..ఈ 3 రాశులవారిపై చతుర్గ్రాహి యోగం ఎఫెక్ట్‌..

 

Chaturgrahi Yog In Tula Rashi: అక్టోబర్ 19న తులారాశిలో కొన్ని గ్రహాల కలయిక జరబోతోంది. ఒకే రాశిలో రెండు కంటే ఎక్కువ గ్రహాలు కలవడం వల్ల కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు సమయ సందర్భాలను బట్టి మంచి, చెడు అని ఉంటాయి. అయితే ఈ నెలలో తుల రాశిలోని ఏకంగా నాలుగు రాశులు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారాల కారణంగా కొన్ని రాశులవారికి మంచి జరిగితే, మరికొన్ని రాశులవారికి ఊహించని నష్టాలు కలుగుతాయి. అయితే ఈ చతుర్గ్రాహి యోగం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడే ఛాన్స్‌ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

చతుర్గ్రాహి యోగం కారణంగా ఏ రాశుల వారికి మేలు జరుగుతుంది:
కర్కాటక రాశి:

అక్టోబర్ 19న తులారాశిలో కుజుడు, కేతువు, సూర్యుడు, బుధుడు కలవబోతున్నాయి. దీని కారణంగా చతుర్గ్రాహి యోగం ఏర్పబోతోంది. దీంతో కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా ఈ సమయంలో మెరుగుపడుతాయి. వ్యాపారాలు చేసేవారికి తీవ్ర ఇబ్బందుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వీరికి జీవితాల్లో అన్ని సానుకూలంగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

సింహ రాశి:
సింహరాశి వారికి నాలుగు గ్రహాల కలయిక కారణంగా ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయం నుంచి జీవితంలో సానుకూల మార్పులు ప్రారంభమవుతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీంతో మీరు అవసరాలకు అనుగుణంగా లాభాలు పొందుతారు. చతుర్గ్రాహి యోగ ప్రభావం వల్ల ఆదాయం భారీగా పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు అనేక రకాల లాభాలు పొదంతారు. 

కన్యారాశి:
తులారాశిలో ఏర్పడిన చతుర్గ్రాహి యోగం కన్యా రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో వీరు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా  కార్యాలయంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి భవిష్యత్‌లో భారీ లాభాలు పొందుతారు.  దీంతో పాటు వీరు ఇతరుల నుంచి కూడా సులభంగా శుభవార్తలు వింటారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News