Rahu and Mercury Conjunction in Pisces 2024: గ్రహాల కాలానుగుణంగా తమ కదలికలను మారుస్తాయి. సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు. అందుకే ఇతడిని గ్రహాల యువరాజు లేదా గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. రీసెంట్ గా బుధుడు మీనరాశి ప్రవేశం చేశాడు. అప్పటికే ఆ రాశిలో దుష్టుడైన రాహువు సంచరిస్తున్నాడు. దీంతో మీనరాశిలో బుధుడు మరియు రాహువు సంయోగం జరిగింది. ఇలా జరగడం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. వీరి కలయిక కొందరికి అనుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. రాహు మరియు మెర్క్యూరీ మైత్రి వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
మకరరాశి
రాహువు మరియు బుధుల సంయోగం వల్ల మకరరాశి వారికి గౌరవం పెరుగుతుంది. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. జాబ్ కోసం ట్రై చేసేవారి కల ఫలిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
మీనరాశి
గ్రహాల కలయిక వల్ల మీనరాశి వారిని అదృష్టం వరిస్తుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు భారీగా లాభాలను తెచ్చిపెడతాయి. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారస్తులు మునుపెన్నడూ చూడని లాభాలను చూస్తారు. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది.
కర్కాటక రాశి
మీనరాశిలో బుధుడు, రాహువు సంయోగం కర్కాటక రాశివారికి చాలా బెనిఫిట్స్ అందించనుంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత మరింత బలపడుతుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులు లాభపడతారు. మీరు ఆర్థికంగా పటిష్టమవుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి బుధ, రాహువుల కలయిక ఎన్నో లాభాలను ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడికైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది.
Also Read: Chandra Grahan 2024 effect: హోలీ రోజే చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు పట్టనున్న దరిద్రం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి