Dussehra 2023: త్రేతా యుగంలో లంకాధిపతి రావణాసురుడు సంహారం జరగడం కారణంగానే ఆ రోజు విజయదశమిని జరుపుకున్నారు. అప్పటినుంచి ఇప్పటిదాకా తరతరాల నుంచి విజయదశమి ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గాను ఈ విజయదశమిని జరుపుకుంటారు. అంతేకాకుండా ఈరోజు దుర్గాదేవి అమ్మవారు మహిషాసురుడిని కూడా హరిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు. అయితే విజయదశమికి పురాణాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దసరా పండక్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటో? పండగ సంబంధించిన ఇతర వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల్లో విజయదశమి గురించి వివిధ రకాలుగా వివరించారు. ఈరోజు అమ్మవారిని పూజించి పాలపిట్ట దర్శనం చేసుకోవడం ఎంతో శుభప్రదమని పేర్కొన్నారు. ఈరోజు మీ ఇంటి వద్ద ఉండే చెట్లపై గోడలపై పక్షులను చూడడం వల్ల జీవితంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు. ఇలా పాలపిట్టను చూడడం వల్ల సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ప్రజల నమ్మకం.
Also Read: King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం
పురాణాల ప్రకారం పాలపిట్ట శ్రీరాముని ప్రతినిధిగా ఉండేదని సామెతల్లో చెప్పుకుంటారు. అంతేకాకుండా ఈ పక్షిని సాక్షాత్తు నీలకంటేశ్వరుడుగా కూడా చెప్పుకుంటారు. సముద్ర మథనం సమయంలో శివుడు విషం తాగే క్రమంలో తన గొంతు నీలం రంగులోకి మారుతుంది. అయితే పాలపిట్ట గొంతు కూడా నీలం రంగులో ఉంటుంది. కాబట్టి ఈ పక్షిని సాక్షాత్తు శివుడిగా భావిస్తారు. అంతేకాకుండా పూర్వీకులు ఈ పక్షిని విజయానికి చిహ్నంగా కూడా భావించేవారు.
శ్రీరాముడు దసరా రోజున పాలపిట్టను చూడడం వల్ల రావణ సంహారం చేయగలిగాడని పురాణాల్లో కథలు చెబుతున్నాయి. రావణుడిపై విజయం సాధించడానికి ఇది ఒక కారణమైనమని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా రావణ సంహారం చేసే క్రమంలో రామలక్ష్మణులు ఇద్దరు మహా శివుడిని పూజించడం వల్ల.. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే రూపంలో వారికి దర్శనమిచ్చారట. అందుకే ప్రతి సంవత్సరం దసరా రోజున పాలపిట్టను చూడడం వల్ల జీవితాంతం విజయాలు కలుగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.