Ganesh Visarjan Time 2023: ఈ సమయాల్లో మాత్రమే గణేశుడి నిమజ్జనం చేయాలి..ఎందుకో తెలుసా?

Ganesh Visarjan Muhurat 2023 Today: గణేశుడి నిమజ్జనంలో భాగంగా తప్పకుండా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన శుభ ముహూర్తాల్లో భాగంగా ఈ నిమజ్జనం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2023, 09:30 AM IST
Ganesh Visarjan Time 2023: ఈ సమయాల్లో మాత్రమే గణేశుడి నిమజ్జనం చేయాలి..ఎందుకో తెలుసా?

 

Ganesh Visarjan Muhurat 2023 Today: ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి తిథి నుంచి ప్రారంభమై చతుర్దశి తిథిలో ముగుస్తాయి. అంతేకాకుండా భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్దశిని అనంత చతుర్దశి అని కూడా అంటారు. ఈ సంవత్సరం అనంత చతుర్దశి 28 సెప్టెంబర్ గురువారం వచ్చింది. గణేష్ నిమజ్జనానికి అనంత చతుర్దశి తేదీ అత్యంత ముఖ్యమైనది. ఈ రోజే వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనం చేస్తారు. అయితే ఏయే సమయాల్లో పూజలు చేసి నిమజ్జనం చేస్తే గణేషుడితో పాటు శివపార్వతుల అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

కోలాహలంగా గణేశుడికి వీడ్కోలు:
గణేష్ ఉత్సవాలలో భాగంగా 11వ రోజు ప్రతిష్ఠించిన గణేషుడి విగ్రహాన్ని పవిత్ర నదిలో నిమజ్జనం చేయడం ఆనవాయితిగా వస్తోంది. ఈ నిమజ్జనంలో భాగంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి హారతి సమర్పిస్తారు. అంతేకాకుండా గణేశుడి  విగ్రహాన్ని డప్పు, సప్పులత్తో ఊరేగించి నిమజ్జనం చేస్తారు. అంతేకాకుండా గణేశుడి నిమజ్జనంలో భాగంగా గణపతి బప్పా మోర్యా, గణేష్ మహారాజ్ కీ జై అంటూ నినాదాలు చేస్తారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

గణేష్ నిమజ్జనానికి శుభ ముహూర్తం:
ఉదయం ముహూర్తం: 06:12 నుంచి 07:42 వరకు
ఉదయం ముహూర్తం (అమృతం): 10:42 నుంచి సాయంత్రం 03:11 వరకు 
ముహూర్తం (Auspicious Muhurta): సాయంత్రం 04:41 నుంచి 06:11 వరకు
సాయంత్రం ముహూర్తం (అమృతం): 06:11 నుంచి 09:12 వరకు
రాత్రి ముహూర్తం (లాభం) - 12:12 నుంచి సెప్టెంబర్ 29,  01:42 వరకు

ఈ పద్ధతితో గణేషుడి నిమజ్జనం చేయండి:
గణపతి నిమజ్జనంలో భాగంగా తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రత్యేక పూజలు చేసి వినాయక నిమజ్జనం చేయాలి. ఇక ఇంట్లోనే నిమజ్జనం చేసేవారు బకెట్‌ నిండా నీటిని పోసుకుని అందులోనే పవిత్ర గంగాజలంను పోసుకుని నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News