Guru Vakri 2022: ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహం భావిస్తారు. దేవగురువు బృహస్పతి సంపద, వైభవం, ఐశ్వర్యం, ఆనందానికి కారకుడు. జూలై 29న బృహస్పతి మీనరాశిలో తిరోగమనం చెందింది. బృహస్పతిని మీనరాశికి అధిపతిగా పరిగణిస్తారు. ప్రస్తుతం గురుడు మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబరు 24న గురుడు ప్రత్యక్ష సంచారంలోకి వస్తాడు. ఇది కొన్ని రాశులవారిపై చెడు ప్రభావాన్ని చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
ఈ 3 రాశులవారు జాగ్రత్త..
మేషం (Aries): బృహస్పతి తిరోగమనం ఈ రాశివారికి శుభప్రదం కాదు. ఈ సమయంలో మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. గురు మార్గి కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ద వహించండి. ఏ పనిలోనూ తొందరపడకండి.
సింహం (Leo): గురుడి మార్గం వల్ల ఈ రాశివారి ఆరోగ్యం చెడే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు వస్తాయి. వృత్తి పరంగా ఇబ్బందులను ఎదుర్కోంటారు. మెుత్తానికి ఈసమయం మీకు కలిసిరాదు.
వృశ్చికం (Scorpio)-బృహస్పతి తిరోగమన స్థానం ఈ రాశివారికి సమస్యలను తెస్తుంది. మీ పనిలో అడగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. మీ స్వభావం మారే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు.
బృహస్పతిని బలపరిచే పరిహారం- గురవారం విష్ణుమూర్తిని పూజించి పసుపు వస్తువులను దానం చేయడం ద్వారా మీ జాతకంలో గురు గ్రహం బలపడుతుంది. తద్వారా మీకు శుభఫలితాలను ఇస్తుంది .
Also Read: Shani Margi 2022: అక్టోబరులో శని యెుక్క 'అఖండ సామ్రాజ్య రాజయోగం'.. ఈ రాశులవారికి ఊహించని ధనలాభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook