Rudraksha Benefits: రుద్రాక్షను ధరించడం వల్ల ఆరోగ్యానికి కలిగి లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Rudraksha Benefits For Health: రుద్రాక్ష పూసలు దైవ స్వరూపంగా హిందువులు భావిస్తారు. వీటిని ఉపయోగించి జపం కూడా చేస్తారు. చాలా మంది ఆధ్యాత్మిక వ్యక్తులు రుద్రాక్ష పూసలను ధరిస్తారు. ఈ రుద్రాక్ష పూసలను వేసుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2024, 03:13 PM IST
Rudraksha Benefits: రుద్రాక్షను ధరించడం వల్ల ఆరోగ్యానికి కలిగి లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Rudraksha Benefits For Health: హిందువుల వేదాల ప్రకారం రుద్రాక్ష పూసలను ధరించడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని చెబుతున్నాయి. రుద్రాక్ష అనేది ఎలిఒకర్ గనిట్రాస్ అనే చెట్టు యొక్క విత్తనం.  ఈ పూసలను శివునికి సంబంధించినవిగా భావిస్తారు ఆధ్యాత్మిక జనులు.  రుద్రాక్షి ధరించడం వల్ల ఆధ్యాత్మిక మెలకువ వస్తుంది.ఈ రుద్రాక్ష పూసలు మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి.

రుద్రాక్ష పూసలు ధరించడం వల్ల ప్రశాంతని పొందుతారని హిందూ గ్రంధాలు చెబుతున్నాయి. దీని వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయి.  అంతేకాకుండా ఈ పూసలు ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతాయి. రుద్రాక్ష పూసలను లెక్కిస్తూ మంత్రాలను చదవడం వల్ల ఏకాగ్రతను పెంచుతుంది. 

కోపం, ఒత్తిడి, తగ్గించడంలో కూడా ఈ పూసలు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా సానుకూల మార్గంలో నడిపించడంలో ఉపయోగపడుతాయి. ప్రశాంత కోసం ఈ మాలను ధరించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా వేదాల్లో రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది పాజిటివ్‌గా ఉంచుతుంది. నెగిటివ్‌ను దగ్గరిరి రాకుండా కాపాడుతుంది. 

రుద్రాక్ష దండ ధరించిన వారు చన్నీటితో స్నానం చేస్తూ ఈ మాల మీద కేవలం నీరు పడేలా చేయడం వల్ల ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. రుద్రాక్ష దండ కవచంలా మిమ్మల్ని రక్షిస్తుంది. 

మనం తినబోయే ఆహారం లేదా నీరు స్వచ్ఛమైనదా కాదా అని గుర్తించడంలో రుద్రాక్ష పూస కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏకముఖి రుద్రాక్ష చాలా శక్తివంతమైనది. దీని ధరించినవారిలో ఒంటరితనం యొక్క భావాలను సృష్టిస్తుంది. కాబట్టి నిపుణులు సలహాతో దీని ధరించడం చాలా మంచిది.  

Also Read  January Lucky Zodiac Sign: ఈ రాశులవారిపై ప్రత్యేక యోగాల ఎఫెక్ట్‌..ఈ రోజు జరగబోయే 99 శాతం ఇదే!

ఐదు ముఖి రుద్రాక్ష సురక్షితమైనది. ప్రశాంతతను తీసుకురావడానికి ప్రసిద్ధి చెందిన ఈ రుద్రాక్ష రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. పిల్లలకు, రుద్రాక్ష పూస వారి దృష్టిని మరియు ఏకాగ్రతను పెంచుతుంది.

చర్మ సంబంధిత రుగ్మతల నుండి ఉపశమనం పొందడంలో కూడా పూస చాలా ప్రభావవంతంగా ఉంటుంది. గాయాలు వంటి సమస్యలను పరిష్కరించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

మార్కెట్లో దొరికే రుద్రాక్షలు అన్నీ నకిలీవే అని నిపుణులు చెబుతున్నారు.అసలైన రుద్రాక్షలను పొందడం ఎంతో కష్టమని కూడా చెబుతున్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వీటిని కొనుగోలు చేసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read Shani Gochar 2024: ఈ రాశులవారికి 2025 వరకు శని దేవుడి అనుగ్రహం..ఏం చేసిన ధన లాభాలే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News