January Lucky Zodiac Sign: ఈ రాశులవారిపై ప్రత్యేక యోగాల ఎఫెక్ట్‌..ఈ రోజు జరగబోయే 99 శాతం ఇదే!

January Lucky Zodiac Sign: ఈ రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో కీలకమని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభించి ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2024, 09:40 AM IST
January Lucky Zodiac Sign: ఈ రాశులవారిపై ప్రత్యేక యోగాల ఎఫెక్ట్‌..ఈ రోజు జరగబోయే 99 శాతం ఇదే!

 

28-30 January 2024 Lucky Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 28 ఎంతో కీలకమైన తేదిగా భావించవచ్చు. ఈ రోజు సూర్య, చంద్ర గ్రహాలు సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. అలాగే ఈ రోజు  మాఘ మాసంలోని కృష్ణ పక్షం, తృతీయ తిథి..దీంతో పాటు ఎంతో శక్తివంతమైన శోభన యోగం, సోహోగ యోగం, మాఘ నక్షత్రాల శుభ సంయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో కొన్ని రాశులవారికి ఊహించని లాభాలతో పాటు కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వృషభ రాశి:
జనవరి నెలలో 28వ నుంచి 30వ తేది చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు ఏర్పడే యోగాల కారణంగా వృషభ రాశి వారు మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా వీరు ఆదివారం సెలవును ఆనందిస్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి పురాతన ఆలయాలను సందర్శించవచ్చు. ప్రేమ జీవితంలో గడుపుతున్నవారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. దీంతో పాటు కాబోయే జీవిత భాగస్వామి మరింత ప్రేమను చూపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్నేహితులతో సరదాగా గడుపుతూ ఉంటారు. దీంతో పాటు కుటుంబ, వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది.

సింహరాశి:
జనవరి 28 సింహరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వృత్తి కోసం విదేశాలకు వెళ్లాలని సూచించబడతారు మరియు ప్రభావవంతమైన పెద్దల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందుతారు. ఆదివారం సెలవులు కావడంతో ఇంట్లో పిల్లలు సందడి చేయడంతోపాటు వారికి ఇష్టమైన ఆహారాన్ని కూడా ఆస్వాదిస్తారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మీరు మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో మీ ఆధిపత్యాన్ని స్థాపించడంలో మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి కనబరుస్తారు, దీనివల్ల తల్లిదండ్రులు సంతోషిస్తారు. ప్రేమలో ఉన్నవారు అందమైన ప్రదేశానికి వెళ్లి తమ భాగస్వామి గురించి కుటుంబ సభ్యులెవరికైనా చెప్పవచ్చు.

Also Read Tamarind Seeds: మంగు మచ్చలను తొలగించడం ఈ గింజలు ఎంతో ఉపయోగపడుతాయి!

తుల రాశి:
తుల రాశి వారికి జనవరి 28 చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అంతేకాకుండా నిలిపోయిన పెద్ద పెద్ద పనులు కూడా పరిష్కారమవుతాయి. ఈ తుల రాశివారికి సూర్యభగవానుడి అనుగ్రహం లభించి అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా సమాజంలో గౌరవం పెరిగి మంచి పేరును పొందుతారు. ఇక ఆస్తుల పరంగా కుటుంబంలో గొడవలు ఎదర్కొంటున్నవారికి ఈ సమయంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకం, వాస్తవాలపై ఆధారపడింది. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read Tamarind Seeds: మంగు మచ్చలను తొలగించడం ఈ గింజలు ఎంతో ఉపయోగపడుతాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News