Today Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో..గ్రహాల త్రిరోగమనాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కొన్ని గ్రహాలు తిరోగమనం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి అనేక దుష్ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి గ్రహసంచారాలతో పోలిస్తే, గ్రహ తిరోగమనాలకే జ్యోతిష్య శాస్త్రంలో ఎక్కువగా ప్రాముఖ్యత ఉందని తెలుస్తోంది. అయితే బుధ గ్రహం డిసెంబర్ 24వ తేదీన వృచ్చిక రాశిలోకి తిరోగమనం చేయబోతోంది. ఈ తిరోగమన ఉదయం 11 గంటలకు జరగబోతోంది. రివర్స్ మోషన్ లో బుధుడు తిరగడం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ రాశుల వారిపై బుధుడి తిరోగమన ఎఫెక్ట్:
మిధున రాశి:
వృశ్చిక రాశిలో బుధుడు తిరుగమనం చేయడం కారణంగా మిధున రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక రకాల లాభాలు పొందుతారు ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు ఇతర కంపెనీల నుంచి కొత్త ఆఫర్లు కూడా పొందుతారు. దీంతోపాటు వీరు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది.
వృశ్చిక రాశి:
బుధ గ్రహం వృశ్చిక రాశిలోకి తిరోగమనం చేయబోతోంది. కాబట్టి ఈ రాశి వారికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరికి ఆదాయం పెరగడమే కాకుండా వ్యాపారాల్లో లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఆలోచనల ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో శృంగార సమస్యలు పరిష్కారమవుతాయి. కెరీర్ పరంగా కూడా ఈ సమయంలో గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు.
కుంభరాశి:
బుద్ధుడితి రోగమనం కుంభ రాశి వారిపై కూడా ప్రభావం చూపబోతోంది ఈ సమయంలో జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య పరిష్కారమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు పిల్లలకు సంబంధించిన విషయంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు. ఇక ఇంతక ముందున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలపడే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter