Horoscope Today: నేటి రాశి ఫలాలు మే 12, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Today Horoscope In Telugu 12 May 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 12వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 12, 2021, 07:45 AM IST
Horoscope Today: నేటి రాశి ఫలాలు మే 12, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 12 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 12వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు మీ చేతికి బాధ్యతలు అప్పగిస్తారు. మీకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ నాయకత్వ లక్షణాలకు ప్రశంసలు అందుకుంటారు. మిమ్మల్ని అనుసరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుర్తుంచుకోండి. ఖర్చులు అధికం కానున్నాయి. ప్రయాణాలపై మరోసారి ఆలోచించండి.

Also Read: Health Tips: రాత్రివేళ ఈ ఆహార పదార్థాలు, Fruits తినకూడదు, అందుకు కారణాలు ఇవే

వృషభ రాశి
మీరు ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తారు. ఇప్పటివరకు తెలియని కొన్ని కొత్త విషయాలను మీరు తెలుసుకుంటారు. మీకు విశ్వాసం లేని వ్యక్తుల మీద నిఘా ఉంచడం ఉత్తమం. ఈ రోజు మిమ్మల్ని అదృష్టం వరించనుంది. చాలాకాలం నుంచి వేచిచూస్తున్న ఆస్తి సమస్యలు కొలిక్కి రానున్నాయి. ఉద్యోగులకు పని భారం తగ్గనుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. 

మిథున రాశి
మీ మాట ఎవ్వరూ వినడం లేదని ఆలోచన మొదలవుతుంది. మీరు అన్ని పనులను సకాంలో పూర్తి చేస్తారు. అయినప్పటికీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు భిన్నంగా వ్యవహరిస్తారు. మిమ్మల్ని పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండనుంది.

కర్కాటక రాశి 
నేడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. పగటి కలలు కనడం మానేసి వాస్తవికంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. ఈ రోజు మీరు పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది. ఇతరులు ఇచ్చే సలహాను స్వీకరించండి, మీ పనిని మెరుగు చేసుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి.

సింహ రాశి
ఈ రోజు కొంత దానం చేసి పుణ్యాన్ని మూటకట్టుకోండి. అవసరమైన వారికి సహాయం చేయడానికి నేడు వెనుకంట వేయకూడదు. కొత్త ప్రాజెక్టులు మీ చేతికి రానున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. 

Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos

కన్య రాశి
కొందరు మీకు విశ్వాసపాత్రులు, విధేయులుగా నటించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మీపై అనుమానం వ్యక్తం చేస్తారు. చేపట్టిన పనులు మధ్యలోనే వాయిదా వేసుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు ఒత్తిడి అధికం కానుంది. 

తులా రాశి
సరైన సమయంలో సరైన స్థలంలో ఉంటే మీకు అదృష్టం కలిసొస్తుంది. కొందరు సన్నిహితులు మిమ్మల్ని కలుసుకుని కొన్ని విషయాలపై చర్చిస్తారు. మీరు చేసే పని ఏదైనా అందులో మీదే పైచేయి అవుతుంది. ఉద్యోగాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారులు సైతం నూతన వ్యాపారాలపై యోచిస్తారు. అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయి.

వృశ్చిక రాశి
మీరు ఈ రోజు పనిచేసేచోట పలువురికి సలహాదారులుగా వ్యవహరిస్తారు. మీ సహోద్యోగులు ఉద్యోగ పరమైన సలహా కోసం మీ వద్దకు రాబోతున్నారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. మీ జ్ఞానాన్ని తెలివిగా ఉపయోగించుకోండి మరియు ఇతరులకు కూడా సహాయం చేస్తారు. వ్యక్తిగత రహస్యాలు ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి. నేడు మీరు ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూల ఫలితాలు. 

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

ధనుస్సు రాశి
మీరు సాధించిన దాని గురించి గర్వపడాల్సిన సమయం ఆసన్నమైంది. కష్టపడ్డవారికి ప్రతిఫలం కచ్చితంగా దక్కుతుంది. కొన్ని శుభవార్తలు చెవిన పడతాయి. నేడు మీరు నూతన ఉద్యోగావకాశం లభించనుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.

మకర రాశి
మీరు కేవలం పనిపైనే ఎక్కువ దృష్టి సారించిన కారణంగా చుట్టుపక్కల వారు మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు. అయితే, మీరు చేస్తున్న పని మరియు దాని ప్రయోజనాలను సైతం వారికి వివరించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని మరువొద్దు. నేడు మీకు ఆకస్మిక ధన వ్యయం గోచరిస్తుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు, ఉద్యోగులకు ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలలో కుటుంబసభ్యులు, సన్నిహితులతో విభేదాలు తలెత్తుతాయి.

కుంభ రాశి
నేడు కొన్ని కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. అయితే పత్రాలు చదవకుండా సంతకం చేయడం అంత శ్రేయస్కరం కాదు. మీ సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ పొజిషన్ కోసం మరికొందరు వేచిచూస్తున్నారు. చేపట్టిన పనులలో జాప్యం తలెత్తుతుంది. ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి రావు. ఉద్యోగులు, వ్యాపారులు మార్పులు కోరుకుంటారు.  

మీన రాశి
నేడు ఈ రాశి వారికి వాహనయోగం గోచరిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీకు చిరాకు అనిపిస్తే, ధ్యానం చేయడానికి కొంత సమయం కేటాయించండి. అలసిపోయినట్లు అనిపిస్తే ఒంటరిగా ఉండాలని భావిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News