Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 19, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ఆస్తి దక్కుతుంది

Today Rasi Phalalu in Telugu From Aries To Pisces | ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2021, 07:59 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 19, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ఆస్తి దక్కుతుంది

Horoscope Today 19 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 19న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు మీ ఆర్ధిక పరిస్థితిని పరిశీలించుకుంటారు. మీరు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని అనుకుంటే వాటిని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో మీకు ఆర్థిక సమస్యలు, రుణాలు తలనొప్పిగా మారతాయి. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. వ్యాపారులకు అంతంతమాత్రంగా ఫలితాలు రానున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. 

Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే

వృషభ రాశి
ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఈ రోజు మీకు ఎదురుకానున్నాయి. సమస్యను వదిలి పారిపోయే బదులు, దాని నుంచి గుణపాఠం నేర్చుకుని అనుభవంగా స్వీకరించండి. మీ ప్రస్తుత సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చుట్టూ ఉన్నవారు సహాయం చేస్తారు. మీకు నేడు ఆస్తి లాభం గోచరిస్తుంది. చేపట్టిన పనులలో కార్యజయం..

మిథున రాశి
విద్యకు సంబంధించి ఇది గొప్ప రోజు. మీరు నేర్చుకోవటానికి క్రొత్తదాన్ని ఎంచుకోవాలనుకుంటే, ఈ రోజు ఉత్తమం. విషయాలను ఎంచుకొని సర్దుబాటు చేయగల సామర్థ్యం మీకు ఉంది. దూర ప్రయాణాల కారణంగా అనారోగ్యం బారిన పడవచ్చు. విద్యార్థులకు పరీక్షలలో సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒత్తిడి అధికం అవుతుంది. కొన్ని విషయాలలో బంధువులతో విభేదిస్తారు.

కర్కాటక రాశి
ప్రజలు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారని మీకు అనిపించవచ్చు. అయితే మీరు దాని గురించి ఏమని భావిస్తున్నారో నిర్మొహమాటంగా చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మీకు ఏమి కావాలో నిర్ణయించుకోండి. శుభవార్తలు అందుతాయి. వ్యాపారులు, ఉద్యోగులకు సానుకూల ఫలితాలు రానున్నాయి. కొన్ని వివాదాల పరిష్కారం కోసం సమయం వెచ్చిస్తారు.

సింహ రాశి
మీ బృందంలో ఓ కొత్త వ్యక్తి చేరనున్నాడు. అతడి వల్ల మీ అందరికీ మంచి జరుగుతుంది. ఈ రోజు మీరు కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు గోచరిస్తున్నాయి. చాలా కాలం తరువాత చిన్ననాటి మిత్రులతో సరదాగా సమయం గడుపుతారు.

Also Read: Non-Veg పిజ్జా డెలివరీ, 1 కోటి రూపాయాలు పరిహారం కోరిన మహిళ, అమెరికా ఔట్‌లెట్‌కు నోటీసులు

కన్య రాశి
మీరు మీ విలువలు మరియు సన్మార్గాలతో సాంప్రదాయంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి విషయం అయినప్పటికీ, ఈ రోజు దీని నుంచి బయటపడి కొన్ని అసాధారణ పనులు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు మానసిక ప్రశాంతతు దూరం చేయనున్నాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. 

తులా రాశి
ఈ రోజు తుల మల్టీ టాస్కింగ్‌ను నివారించడానికి ప్రయత్నించండి. మీ మనస్సు ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన విషయంపై కేంద్రీకృతమై ఉంది. ఒకే సమయంలో చాలా ఎక్కువ పనులు చేయడం మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ మానసిక ప్రశాంతతను కోల్పోతారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రావు. ఒత్తిడి అధికం కానుంది.

వృశ్చిక రాశి
ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో నడుచుకుంటారు. మీరు ఏమి చేయటానికి భయపడుతున్నారో, లేదా వెనక్కి తగ్గుతున్నారో ఆ పనిని ప్రారంభించేందుకు సిద్ధమవుతారు. మీ ఆత్మవిశ్వాసం మరియు శక్తి అన్ని పనులను పూర్తి చేయడంలో సహాయపడుతుంది. కుటుంబసభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ధనుస్సు రాశి
ఇతరుల మాట వినవలసిన సమయం ఇది. కొన్ని విషయాలు మీకు తెలిసినా, ఇతరుల నిర్ణయం అత్యుత్తంగా ఉండే అవకాశం ఉందని గ్రహిస్తారు. అనుభవజ్ఞులైన మరియు ఆ ప్రాంతంలో ఏమి జరుగుతుందో తెలిసిన నిపుణుల సలహా పొందడానికి ప్రయత్నించండి. కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. గౌరవమర్యాదలు పొందుతారు. ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు లభించనుంది.

మకర రాశి
ఈ రోజు మీ పనుల కోసం పోరాడుతారు. మీకు ఇష్టమైనది ఒకటి మీ నుంచి దూరం కానుంది. మీరు నమ్మే దానికోసం ఎంతవరకైనా వెళ్తారు. మీ దృక్పథాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి. ఒకేచోట కూర్చోకుండా, బయట తిరుగుతూ సమాచారం గ్రహిస్తారు. దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

కుంభ రాశి
మీరు ఇష్టపడే మరియు విశ్వసించే వ్యక్తుల సలహాలను తీసుకుంటారు. వారికి మీకన్నా ఒక విషయం ఎక్కువ తెలుసునని భావించి నడుచుకుంటారు. ఈ రోజు మీరు చేసే పనుల గురించి మరియు మీరు తీసుకునే నిర్ణయాలపై జాగ్రత్త అవసరం. అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి.

మీన రాశి
మీ భావాలను వ్యక్తీకరించడానికి నేడు చాలా మంచిరోజు. మీరు విశ్వసించే వారితో మాట్లాడండి మరియు మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదాని గురించి మీరు ఏమని భావిస్తున్నారో వారికి చెప్పండి. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన పరిచయాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Trending News