Horoscope 30 December 2021: ఈ రాశి వారికి నేడు కలిసొస్తుంది.. ప్రేయసితో శృంగారానికి అనువైన సమయం!

Horoscope 30 December 2021: గురువారం (డిసెంబరు 30) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.  ఆస్తులు వ్యవహారంలో తులా రాశి వారి జాగ్రత్తలు వహించాలి. తమ ప్రియురాలితో శృంగారంలో పాల్గొనేందుకు తులా రాశివారికి ఇదే సరైన సమయం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 10:43 AM IST
Horoscope 30 December 2021: ఈ రాశి వారికి నేడు కలిసొస్తుంది.. ప్రేయసితో శృంగారానికి అనువైన సమయం!

Horoscope 30 December 2021: ఈరోజు (డిసెంబరు 30) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి. గురువారం మీనరాశి కలిగిన వ్యాపారులు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. మరోవైపు తమ ఆలోచలను కోరికలను కుంభరాశి వారు ఇతరులపై రుద్దడం సరైనది కాదు. ఆస్తులు వ్యవహారంలో తులా రాశి వారి జాగ్రత్తలు వహించాలి. తమ ప్రియురాలితో శృంగారంలో పాల్గొనేందుకు తులా రాశివారికి ఇదే సరైన సమయం. 

ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు; మార్గశిర మాసం; బహుళ పక్షం 

ఏకాదశి: ఉ. 9.44 తదుపరి ద్వాదశి

విశాఖ: రా. 9.46 తదుపరి అనూరాధ

వర్జ్యం: రా. 1.30 నుంచి 3.00 వరకు

అమృత ఘడియలు: మ.1.28 నుంచి 2.58 వరకు; దుర్ముహూర్తం: ఉ. 10.13 నుంచి 10.57 వరకు తిరిగి మ.2.36 నుంచి 3.20 వరకు

రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు

సూర్యోదయం: ఉ.6.34, సూర్యాస్తమయం: సా.5-32

మేష రాశి: 

మేష రాశి వారికి నేడు (డిసెంబరు 30) అద్భుతంగా ఉంటుంది. అనేక చిన్న పెట్టుబడులు భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. స్త్రీలు ఇంటి పనుల్లో ఎక్కువ బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.

వృషభ రాశి:

వృషభ చెందిన వారు నేడు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఏదైనా అదనపు ఆదాయ వనరులను పొందడం ద్వారా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాల్లో నేడు  కార్యాలయంలో సహోద్యోగులతో కలిసి పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సామాజిక సమన్వయంతో ప్రతిష్ట మెరుగ్గా ఉంటుంది.

మిథున రాశి: 

మీ మాటల వల్ల ఇతరులు ప్రభావితం అవుతారు. మీ కోరిక మేరకు వృత్తి జీవితంలో కొన్ని పనులు సాగిపోతుంటాయి. చాలా కాలంగా ఆగిపోతున్న వ్యాపారానికి సంబంధించిన కొన్ని పనులు నేడు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోవడం ద్వారా మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటక రాశి:

ఈ గురువారం మీరు చేసే పనిలో మనస్సును కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా మిమ్మల్ని మీరు బలంగా భావిస్తారు. తెలివిగా పని చేయండి, ఇబ్బందులు కూడా సులభంగా ఉంటాయి. యువత కెరీర్‌లో గొప్ప విజయాన్ని అందుకోవచ్చు. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అది మీ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతుంది.

సింహ రాశి: 

మీరు ఈ రోజు చాలా బిజీగా గడుపుతారు. మీరు ఆర్థిక విషయాలలో లాభపడతారు. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, నేడు మీరు విజయం సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. సంబంధాలలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంది.

కన్యా రాశి: 

నేడు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. మీ వ్యక్తిత్వానికి సమాజంలోని ప్రజలు ప్రభావితమవుతారు. ఏదైనా పథకంలో చేరే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. వ్యాపారస్తులు డబ్బు గురించి కస్టమర్లతో వాదించకుండా ఉండాలి. పనికి సంబంధించిన ప్రతి చిన్న విషయంపై శ్రద్ధ వహించండి.

తులా రాశి: 

ఈ రాశివారు నేడు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. శ్రమ బలంతో మీరు కష్టాలను అధిగమిస్తారు. ఆస్తి ఒప్పందానికి సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ సంపాదనను జాగ్రత్తగా ఖర్చు చేయండి. మీరు మీ స్నేహితురాలిని శృంగార ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

వృశ్చిక రాశి: 

నేడు ఈ రాశివారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీ ఇంట్లోనే ఉంటూ చాలా వరకు పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు సమయం చాలా కష్టంగా ఉంటుంది, కానీ నిరుత్సాహపడకండి. పైఅధికారులు మీ పనిని చూసి మెచ్చుకుంటారు. అత్తమామల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

ధనుస్సు రాశి : 

మీరు కనే కలలు ఏవైనా నేడు నెరవేరే అవకాశం ఉంది. మీ ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. మీరు ఆన్‌లైన్ షాపింగ్ కూడా చేయవచ్చు. అత్యాశకు పోయి ఎలాంటి అక్రమ పనులు చేయవద్దు. నేడు బంధువు మిమ్మల్ని సహాయం కోసం అడగవచ్చు.

మకర రాశి: 

గురువారం మీకు సంతోషం, శాంతి కలగనుంది. వ్యాపారంలో ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేయండి. ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

కుంభ రాశి: 

కుంభరాశి వారు నేడు తమ కోరికలను, ఆలోచలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయకపోవడం మంచిది. పరిపాలనకు సంబంధించిన పనులు సులువుగా సాగుతాయి. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వ్యాపార కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయి. మంచి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. అలాగే, తండ్రి విశ్వాసం మీపై నిలిచి ఉంటుంది.

మీన రాశి: 

ఈ రాశి వారికి నేడు పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారంలో అనుకూల లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు మీ అత్తమామలను కలుసుకుని వారి యోగక్షేమాలు అడుగుతారు.  

Also Read: Venus Transit : రేపు శుక్రుడు రాశి మారుతున్నాడు.. ఈ రాశులకు అంతా మంచే జరుతుంది!

Also Read: promotion tips : ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా.. సమాజంలో గౌరవం పెరగాలన్నా ఇలా చేస్తే సరి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News