Horoscope Today 24 September 2022: ఆ రెండు రాశుల వారికి గడ్డుకాలం.. అధిక ధనవ్యయం తప్పదు!

Today Astrological prediction for 24 September 2022. కన్య, మకరం రాశుల వారికి గడ్డుకాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారికి ధనవ్యయం తప్పదు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 24, 2022, 06:23 AM IST
  • 24 September 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రెండు రాశుల వారికి అధిక ధనవ్యయం తప్పదు
Horoscope Today 24 September 2022: ఆ రెండు రాశుల వారికి గడ్డుకాలం.. అధిక ధనవ్యయం తప్పదు!

Horoscope Today 24 September 2022: మేషం (Aries): శుభకాలం. అనుకున్నది సాధించే వరకు అస్సలు పట్టు వదలకండి. అవసరానికి సాయం అందుతుంది. కుటుంబంతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాల అనంతరం పనులను ప్రారంభిస్తే మంచిది. ఇష్టదైవారాధన శుభప్రదం. 

వృషభం (Taurus): భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయత్నాలు చేస్తేనే ఫలితాలు ఉన్నాయి. అవసరానికి తగ్గట్టు ముందుకు సాగండి. ప్రయాణ సూచన ఉంది. శివారాధన శుభకరం. 

మిథునం (Gemini): శుభ సమయం నడుస్తోంది. కుటుంబ సభ్యులకు అనుకూల సమయం. కీలక సమయాల్లో ధైర్యంగా ఉంటారు. అనవసర విషయాలలో ఎక్కువ సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. శివారాధన శుభప్రదం.

కర్కాటకం (Cancer): నూతనంగా చేపట్టిన పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కీలక విషయాల్లో పెద్దల సలహాలు అవసరం. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు ఉన్నాయి. శివారాధన శుభప్రదం.

సింహం (Leo): సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో అనుకూలత వాతావరణం ఉంది. ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం. 

కన్య (Virgo): మిశ్రమ కాలం. కుటుంబ సభ్యుల అండతో విజయాలు సాధిస్తారు. శారీరకశ్రమ అధికం అవుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. అధిక ధనవ్యయం ఉంది. సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ శుభాన్ని కలిగిస్తుంది.

తుల (Libra): శ్రమకు తగిన ఫలితాలు ఉన్నాయి. ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తవుతాయి. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.  

వృశ్చికం (Scorpio): మనోధైర్యంతో పనులు చెస్తే గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. మీ పై అధికారులు అనుకూల నిర్ణయాన్ని తీసుకుంటారు. కుటుంబ సభ్యుల అండతో కీలక పనులను పూర్తి చేస్తారు. ఉమామహేశ్వరస్తోత్రం చదివితే మంచిది.

ధనస్సు (Sagittarius): అన్ని రంగాలవారికి శుభకాలం. అభివృద్దికి సంబంధించిన ఓ శుభవార్త  వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణ సూచన ఉంది. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

మకరం (Capricorn): మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధిక ధనవ్యయ సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. అతిగా నమ్మడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. సూర్య నమస్కారం మంచిది. 

కుంభం (Aquarius): మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి అనుకూల సమయం. ఓ శుభవార్త  వింటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. లక్ష్మీదేవి దర్శనం మంచింది. 

మీనం (Pisces): శుభకాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులను పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్ట దైవారాధన మంచిది.

Also Read: Ind vs Aus 2nd T20 Match: ఆసిస్‌పై టీమిండియా విజయం.. ఉప్పల్ మ్యాచ్‌పై పెరిగిన ఉత్కంఠ

Also Read: Pooja Hegde Hot Photos: ఎద అందాలు ఆరబోస్తున్న బుట్టబొమ్మ.. క్లీవీజ్ కనిపించేలా ట్రీట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News