Horoscope Today August 7th 2022: ఇవాళ ఆదివారం. సూర్య భగవానుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కొన్ని రాశుల వారికి ఇవాళ శుభదినం. నేటి ఆదివారం ఏ రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...
మేష రాశి (Aries)
వ్యాపారంలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు. కాబట్టి కష్టపడి పనిచేయడం మానవద్దు.మీ పరిచయాలు, సంబంధాలు మరింత విస్తృతమవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు ప్రొడక్షన్‌తో పాటు మార్కెటింగ్‌పై ఫోకస్ చేయాలి. ఉద్యోగస్తులు వర్క్ విషయంలో గతం కన్నా భిన్నశైలిని ఫాలో అవుతారు. అది మీ సీనియర్లకు నచ్చుతుంది. మహిళలు ఏ పని మొదలుపెట్టేందుకైనా ఇది అనుకూల సమయం. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవారికి మంచి ఫలితాలు అందుతాయి.
వృషభ రాశి (Taurus)
బిజినెస్‌లో బాగా రాణిస్తారు. అది మీ దగ్గరివారిని సైతం ఆశ్చర్యపరుస్తుంది. పూర్తి శక్తి సామర్థ్యాలను వెచ్చిస్తారు. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. కుటుంబ సంబంధిత వివాదాలు, ఆస్తి వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. స్టాక్ మార్కెట్ ద్వారా కూడా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు,వ్యాపార విస్తరణ సూచనలున్నాయి. కళా రంగంలో ఉన్నవారు కూడా బాగా రాణిస్తారు.
మిథున రాశి (GEMINI)
కుటుంబపరమైన వివాదాలు కాస్త చికాకు కలిగిస్తాయి. ప్రతీ చిన్న విషయంలో తగాదా మంచిది కాదు. మీ మాట తీరు, పనితీరు ఒకేలా ఉండాలి. అప్పుడే మీ పట్ల గౌరవం పెరుగుతుంది. ఇంట్లో పెద్దలు మీరు చేపట్టే పనులను అభినందిస్తారు. ముఖ్య విషయాల్లో మీతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటారు. దంపతులు జీవితభాగస్వామి మద్దతు పొందుతారు.
కర్కాటక రాశి (Cancer)
మీ వ్యక్తిత్వం మరింత మెరుగవుతుంది. అది ఇతరులను ఇట్టే ఆకర్షిస్తుంది. మీరెక్కడున్నా సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా ఉంటారు. మీ రిలేషన్‌షిప్‌లో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరి. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ ఇబ్బందిపెడుతాయి. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వీలైతే ధ్యానం కూడా చేయాలి.
సింహ రాశి (LEO)
మీ ప్రేయసి లేదా జీవిత భాగస్వామికి మంచి బహుమతి అందిస్తారు. ప్రేమ బంధం మరింత వికసిస్తుంది. రిలేషన్‌షిప్స్‌లో ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకుంటారు. ప్రేమ జంటలు పెళ్లి విషయంలో ముందడుగు వేసేందుకు అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా కళ్ల సంబంధిత సమస్యలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి.
కన్య రాశి (Virgo)
పని ప్రదేశంలో మీపై కుట్రలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విదేశీ ఉద్యోగ ఆఫర్ రావొచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి బాస్ నుంచి ప్రశంసలు, ప్రమోషన్ దక్కే ఛాన్స్ ఉంది. వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. రిస్క్‌తో కూడిన పనులకు కాస్త దూరంగా ఉండటం మేలు. టెక్నికల్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు,ప్రయోజనాలు ఉంటాయి. అలాగే, రాజకీయ రంగంలో ఉన్నవారు బాగా రాణించగలరు.
తులా రాశి (Libra)
కొన్ని లగ్జరీ వస్తువుల కొనుగోలుకు ఎక్కువ డబ్బు వెచ్చిస్తారు. ఆ కారణంగా తర్వాతి రోజుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకు అవసరమైన దాని కన్నా ఎక్కువ డబ్బు వెచ్చించడం శ్రేయస్కరం కాదు. విదేశీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారికి ఇది శుభ సమయం. ఇదివరకటి కన్నా ఎక్కువ లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి (Scorpio)
ఇంట్లో వివాదాలు సద్దుమణుగతాయి. మీ జీవిత సహచరుడు లేదా సహచరితో ప్రేమ బంధం మరింత వికసిస్తుంది. ఇరువురికి ఒకరి పట్ల ఒకరికి మరింత నమ్మకం ఏర్పడుతుంది. తండ్రి, తోబుట్టువులతోనూ సంబంధాలు మరింత బలపడుతాయి. కీలక పనుల్లో తండ్రి సూచనలు స్వీకరిస్తారు. విద్యార్థులకు ఇది శుభ సమయం. చట్టపరమైన పనులు కొన్ని వాయిదా పడవచ్చు.
ధనుస్సు రాశి (Sagittarius)
మీ జీవితభాగస్వామి పేరిట పెట్టే పెట్టుబడుల్లో లాభాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రేయసి/ప్రియుడు మీకు అన్నివేళలా మద్దతుగా నిలుస్తారు. ప్రేమ విషయం మీ బంధువులకు తెలిసే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలతో జీవితాన్ని గందరగోళంలోకి నెట్టవద్దు. ఓపికతో ముందుకు సాగాలి.
మకర రాశి (Capricorn)
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. డయాబెటీస్, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడేవారు ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినే అలవాటు మానుకోవాలి. మీ శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసేవారికి మీ ఎదుగుదలే సమాధానం చెబుతుంది. కెరీర్‌లో వేగవంతమైన పురోగతి ఉంటుంది. ఇవాళ సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే మీ కోర్కెలు నెరవేరుతాయి.
కుంభ రాశి (Aquarius)
ఆర్థికంగా మీరు చాలా ఉన్నత స్థితిలో ఉంటారు. ఉద్యోగస్తుల వేతనంలో స్వల్ప పెంపు ఉంటుంది. టెక్నికల్ ఫీల్డ్‌లో ఉన్నవారు బాగా రాణించగలరు. ప్రయాణాలకు సిద్ధమవుతున్నవారు బడ్జెట్‌ను సరిగా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా విహారయాత్రలకు వెళ్లేవారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నోరు జారవద్దు. ఇవాళ మీరు నోరు జారినట్లయితే ఆ వివాదం చాలాకాలం పాటు మిమ్మల్ని వెంటాడుతుంది. ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు.
మీన రాశి (Pisces)
మీ ప్రేయసి లేదా ప్రియుడిని బాగా అర్థం చేసుకోవాలి. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. అనవసర వాదనలతో గ్యాప్ పెంచుకోవద్దు. జీవితభాగస్వామికి మీ అవసరాలు చెప్పండి. ఆమె లేదా అతని మద్దతు ఉంటేనే ఏ పనైనా సులువుగా పూర్తి చేయగలరు. జీవిత భాగస్వామితో తగిన సమయం గడపండి. వారికి ఒంటరి భావన కలిగించకండి. అది వైవాహిక జీవితంలో లేనిపోని ఇబ్బందులు తీసుకొస్తుంది. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: Addanki Dayakar Comments: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి అద్దంకి దయాకర్ క్షమాపణలు
Also Read: Shravana Masam 2022: ఆగస్టు 27 వరకు ఈ నియమాలు పాటిస్తే.. ఇక మీకు తిరుగులేని అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook