Shravana Masam 2022: ఆగస్టు 27 వరకు ఈ నియమాలు పాటిస్తే.. ఇక మీకు తిరుగులేని అదృష్టం..

Shravana Masam 2022 Remedies: శ్రావణ మాసం ముగిసే ఆగస్టు 27 వరకు కొన్ని నియమాలు పాటించడం ద్వారా శివ అనుగ్రహంతో అదృష్టాన్ని పొందవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2022, 12:59 PM IST
  • జూలై 29 నుంచి ఆగస్టు 27 వరకు
  • ఈ నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు
  • ఏయే నియమాలు పాటించాలో తెలుసుకోండి
 Shravana Masam 2022: ఆగస్టు 27 వరకు ఈ నియమాలు పాటిస్తే.. ఇక మీకు తిరుగులేని అదృష్టం..

Shravana Masam 2022 Remedies: శ్రావణ మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసమంతా నిత్యం పూజలు, వ్రతాలతో సాగుతుంది. శ్రావణ మాసం మొత్తం పరమేశ్వరుడిని భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. ఒకరకంగా ఈ మాసం శివుడికి అంకితం చేయబడినదని చెప్పవచ్చు. శివ అనుగ్రహం ద్వారా వ్యక్తుల జీవితంలో అన్ని కలిసొస్తాయి. అందుకే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో కొన్ని నియమాలు పాటిస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో సూచించిన ఆ నియమాలు, వాటి ద్వారా పొందే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

మారేడు దళం శివుడికి ప్రీతికరమైనది :

మారేడు దళం, మారేడు పండు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాబట్టి శివ పూజ సందర్భంగా వీటిని సమర్పిస్తే ఆ దైవం అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే, మారేడు చెట్టు వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే పేదలు ధనవంతులవుతారు.  శ్రావణ మాసం ముగిసే ఆగస్టు 27 వరకు క్రమం తప్పకుండా ఈ నియమాలు పాటించాలి.

మారేడు చెట్టుకు పాలు :

మారేడు చెట్టు మూలానికి ఆవు పాలను సమర్పించాలి. చెట్టు వద్ద దీపాన్ని వెలిగించి శివ మంత్రాన్ని పఠించాలి. ఆగస్టు 27 వరకు ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు తగిన ఉద్యోగం దొరుకుతుంది.

మారేడు చెట్టు మట్టితో తిలకం :

మారేడు చెట్టు ఉన్న చోటు నుంచి కొద్దిగా మట్టిని తీసుకోండి. దాన్ని ఇంటికి తీసుకొచ్చి నుదుటిపై తిలకంగా ధరించండి. ఆగస్టు 27 వరకు ఇలా క్రమం తప్పకుండా చేస్తే జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. 

జీవితంలో నిరంతరం సమస్యలు ఉంటే, బిల్వ చెట్టు యొక్క కొద్దిగా మట్టిని ఇంటికి తీసుకువచ్చి, దానిపై తిలకం వేయండి. దీని వలన పుణ్యఫలం లభిస్తుంది మరియు అన్ని కష్టాలు తొలగిపోతాయి. వైవాహిక సుఖం కోసం శివుడికి, పార్వతికి బిల్వ పత్రాలను సమర్పించాలని చెబుతారు.

కోరికలు నెరవేరుతాయి :

పార్వతీ పరమేశ్వరులకు మారేడు దళాన్ని సమర్పిస్తే వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. శివ పార్వతులకు కనీసం 108 మారేడు దళాలు సమర్పించాలి. అలాగే, శివ లింగంపై గంధంతో 'ఓం' రాస్తే మనసులోని కోర్కెలు నెరవేరుతాయి. ఆగస్టు 27 వరకు క్రమం తప్పకుండా దీన్ని పాటించాలి.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, మతపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: RBI Repo Rate Hike: మరోసారి రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ... బ్యాంకు రుణాలపై పెరగనున్న వడ్డీ భారం

Also Read: Venus Transit 2022: మరో 48 గంటల్లో ఈ 5 రాశుల వారికి శుభకాలం మొదలు.. ఇక పట్టిందల్లా బంగారమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News