Horoscope Today Feb 2 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి లవర్స్‌తో మనస్పర్థలు..

Horoscope Today  Feb 2 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కలిసొచ్చే అవకాశం ఉండగా.. మరికొందరికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 10:41 AM IST
  • ఆ రాశి వారికి లవర్స్‌తో మనస్పర్థలు
  • కొన్ని రాశుల వారికి దూకుడు తత్వం పనికిరాదు
  • ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి మిశ్రమ ఫలితాలు
Horoscope Today Feb 2 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి లవర్స్‌తో మనస్పర్థలు..

Horoscope Today Feb 2 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి దూకుడు స్వభావం పనిచేయదు. వ్యాపార వర్గాల్లోని వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి బదిలీ జరిగే అవకాశం లేకపోలేదు. కొన్ని పనులు సకాలంలో పూర్తి కాకపోవడం మరిన్ని ఇబ్బందులు కలగజేయవచ్చు.

మేషం - Aries : విద్యార్థులు, యువత తమ చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ముఖ్య విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. భూమి, ఆస్తులు, డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఇతరులతో సంబంధాలు చెడిపోకుండా జాగ్రత్తపడాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. లక్కీ కలర్: హానీ, లక్కీ నంబర్: 9

వృషభం - Taurus : ఇతరుల ఆలోచనలను సావదానంగా వినే ప్రయత్నం చేయండి. తద్వారా ఆయా పరిస్థితుల్లో మీ దృక్పథంలో కొంత మార్పు అలవడుతుంది. వ్యాపార రంగంలో ప్రతికూల పరిస్థితులు వెంటాడుతాయి. అయినప్పటికీ మీ పట్టుదల, కృషితో వాటిని అధిగమించవచ్చు. లక్కీ కలర్ : బీగ్, లక్కీ నంబర్ : 3 

మిథునం - Gemini : సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటూ వెళ్తే సక్సెస్ మీ వెంటే ఉంటుంది. వ్యాపార రంగంలో కొత్త పరిచయాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారులతో సంబంధాలు బలపడుతాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని చికాకులు తప్పవు. లక్కీ కలర్ : లావెండర్, లక్కీ నంబర్ : 2

కర్కాటకం - Cancer : ఆర్థికపరమైన విషయాలకు, ముఖ్యంగా పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కాదు. ఒకరకంగా ఇది బీజాలు నాటి అవి మొలకెత్తే సమయం కోసం వేచి చూడాల్సిన సందర్భం లాంటిది. అవి తప్పకుండా ఫలితాలను ఇస్తాయి. మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్, అహంకారం మిమ్మల్ని దెబ్బతీస్తుంది. లక్కీ కలర్ : బ్రౌన్, లక్కీ నంబర్ : 7

సింహం - Leo : భావోద్వేగాలను తక్కువగా అంచనా వేయకండి. చేసే పనుల్లో మనసు పెట్టి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగంలో పోటీ అధికమవుతుంది. దీంతో వ్యాపారం కోసం మరింత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. మీ సంస్థలో ఒక ఉద్యోగి అకస్మాత్తుగా తప్పుకోవడంతో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. లక్కీ కలర్ : యాష్, లక్కీ నంబర్ : 8

కన్య - Virgo : ఏ పనికైనా ముందు దాని మంచి చెడ్డలు ఆలోచించండి. దూకుడు తత్వం పనిచేయదు. ఉద్యోగంలో ఉన్నవారికి బదిలీ అవకాశం ఉండొచ్చు. ఇంట్లో వాతావరణం మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. ప్రేమికుల మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా వారి బంధం దెబ్బతినే అవకాశం ఉంది. లక్కీ కలర్ : మ్యాంగో, లక్కీ నంబర్: 6

తుల - Libra: పనులు సకాలంలో పూర్తి కావు. భవిష్యత్తు గురించి ఆందోళన పెరుగుతుంది. మీ భాగస్వామి మద్దతు ఆందోళనను కొంత మేర తగ్గిస్తుంది.  అయితే కొన్ని విషయాల్లో కలిసొచ్చే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లక్కీ కలర్ : Opal, లక్కీ నంబర్ : 5

వృశ్చికం - Scorpio: కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న కన్ఫ్యూజన్ నుంచి బయటపడుతారు. మీ ప్రత్యర్థులు మౌనం దాలుస్తారు. వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. మునుపటి కన్నా వ్యాపారంపై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. లక్కీ కలర్ :  Turquoise, లక్కీ నంబర్ : 3

ధనుస్సు - Sagittarius : జీవితంలో ఎదురయ్యే ప్రతీ పరిస్థితికి ఏదో ఒక కారణం ఉంటుందని నమ్మండి. మీ కలలను నిజం చేసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయండి. అలా అని తప్పుడు మార్గాలు అనుసరించవద్దు. ఆస్తి సంబంధిత విషయాల్లో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. లక్కీ కలర్ : మజెంటా, లక్కీ నంబర్: 4

మకరం - Capricorn: ముందుగా అనుకున్న పనులు పూర్తి చేయండి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందుల కారణంగా ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు. విద్యార్థులకు పూర్తి అనుకూల సమయం. కొన్ని తప్పుడు నిర్ణయాలు మిమ్మల్ని బాధిస్తాయి. లక్కీ కలర్ : వయొలెట్, లక్కీ నంబర్ : 7

కుంభం - Aquarius: అనుకోని పరిచయం ఒకటి మీ జీవితాంతం కొనసాగే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇతరులకు ఉచిత సలహాలు ఇవ్వొద్దు. మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగిస్తే వ్యాపారంలో మరిన్ని ఫలితాలు పొందగలరు. లక్కీ కలర్: కాషాయం, లక్కీ నంబర్: 1

మీనం - Pisces : ఒకానొక సంక్లిష్ట దశ నుంచి విజయవంతమయ్యే దశకు చేరుకుంటారు. చాలాకాలంగా మీరు కృషి చేస్తున్న ఒక ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవుతుంది. పాత మిత్రులను మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. అనుకోని ప్రయాణాలు ఉండొచ్చు. లక్కీ కలర్ : మెరూన్, లక్కీ నంబర్: 2

Also Read: IND vs WI ODI Series 2022: ఇండియా, వెస్టిండీస్ వన్డే సిరీస్ కు ప్రేక్షకులకు నో ఎంట్రీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News