Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 27 జూన్ 2021, Rasi Phalalu, ఓ రాశివారికి ప్రయాణాలతో అనారోగ్య సమస్యలు

Horoscope Today 27 June 2021: మీరు పనిచేసే చోట దాదాపు పూర్తి శక్తి సమార్థ్యాలను ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ వంద శాతం ఫలితాలను సాధించలేరని తెలుసుకోవాలి. మీరు ప్రారంభించిన దాన్ని పూర్తి చేయడానికి కావాల్సిన శక్తిని స్వయంగా గుర్తించాలి. నూతన ఇంటి విషయాలపై నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2021, 08:00 AM IST
Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 27 జూన్ 2021, Rasi Phalalu, ఓ రాశివారికి ప్రయాణాలతో అనారోగ్య సమస్యలు

Horoscope Today 27 June 2021: మేష రాశి
ఈ రోజు మీ పనులలో జాప్యం జరుగుతుంది. ఒకే సమయంలో పలు ప్రాజెక్టులు, పనులతో తీరికలేకుండా గడుపుతారు. అయినప్పటికీ ఇది పురోగతికి మాత్రం కాదు, కేవలం నిలకడకు అనువైన అవకాశంగా భావించాలి. వాహనాలు కొనుగోలు చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

వృషభ రాశి
మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని కుట్ర పన్నుతారు. ప్రస్తుతానికి మీకు పురోగతి కనిపిస్తోంది. వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి మీరు ఇష్టపడరు. మీ ప్రాజెక్టులలో ముందడుగు వేయడం సాధ్యం కాదు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. ఉద్యోగులకు పనిభారం అధికం కానుంది.

Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్

మిథున రాశి
చాలా కాలం తరువాత ఓ వ్యక్తి తిరిగి మీ వద్దకు చేరుకుంటాడు. మీరు నిజంగా మారిపోయారని తెలుసుకుని సంతోషిస్తారు. కొన్ని విషయాలను తెలుసుకుంటారు, మరొకొన్ని విషయాలు నెమరువేసుకుంటారు. ప్రయాణాలతో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.

కర్కాటక రాశి 
సుదీర్ఘకాలం తరువాత బాల్య స్నేహితుడు ఓ పని మీద మిమ్మల్ని కలుసుకోనున్నాడు. కొన్ని శుభకార్యాలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు అందుతాయి. విద్యార్థులు కెరీర్, ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తారు.

సింహ రాశి
మీరు పనిచేసే చోట దాదాపు పూర్తి శక్తి సమార్థ్యాలను ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ వంద శాతం ఫలితాలను సాధించలేరని తెలుసుకోవాలి. మీరు ప్రారంభించిన దాన్ని పూర్తి చేయడానికి కావాల్సిన శక్తిని స్వయంగా గుర్తించాలి. నూతన ఇంటి విషయాలపై నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందుతాయి.

కన్య రాశి
నేడు కేవలం ఓ వ్యక్తితో చర్చించేందుకు మీ పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు. అయితే దాని ద్వారా కలిగే ప్రయోజనం గురించి సైతం ఆలోచించాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులు తమ కార్యాచరణపై ఫోకస్ చేయాలి.

Also Read: Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ? 

తులా రాశి
మీరు కీలక విషయాలపై నేడు కుటుంబసభ్యులతో చర్చిస్తారు. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన అధికం అవుతుంది. పుణ్యక్షేత్రాలు, ఆలయాలు సందర్శించాలని ఆలోచిస్తారు. కొన్ని విషయాలలో సన్నిహితులతో మాట పట్టింపులు వస్తాయి. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహించాలి.

వృశ్చిక రాశి 
ఇతరుల కారణంగా మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి ఉపశమనం కలగనుంది. వారి ప్రవర్తన మీ దృష్టిని ఆకర్షించలేదని అర్ధం చేసుకుంటారు. విషయాలలో పట్టువిడుపులు ఉండాలి. కానీ ప్రతి విషయాన్ని వదిలేస్తే నష్టపోయేది మీరే. ఓ విషయంలో ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. సన్నిహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు.

ధనుస్సు రాశి
ఇతరులకు తృప్తికరమైన పనులు చేయడం ఈ రోజు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీ సాయం కోరి వచ్చిన వారిని మీరు ఏ సమయంలోనూ నేడు వెనుకకు పంపరు. ఆ వ్యక్తులతో భవిష్యత్తులో సంబంధాలు ఏర్పడుతాయి. అధికంగా శ్రమించిన ఫలితం ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. 

Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే

మకర రాశి
ప్రస్తుత సమయంలో మీరు కోరుకున్నంత ఓపికగా వ్యవహరించలేరు. మానసిక ప్రశాంతత కోసం నేడు కొంత సమయం ధ్యానం చేయాలి. క్రమశిక్షణ, నిబద్ధత లేకపోతే ప్రాజెక్టులు చేతికి అందవు. విద్యార్థులు తమ కెరీర్ గురించి ఆలోచిస్తారు. వ్యాపారులు పెట్టుబడులపై ఫోకస్ చేస్తారు.

కుంభ రాశి
ఈరోజు గతాన్ని తలుచుకుని బాధపడతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని, జరిగిన తప్పిదాలతో తెలుసుకుంటారు. ఇతరు తప్పిదాల కారణంగా అనర్థాలు జరిగాయని, ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. కుటుంబసభ్యులతో పలు విషయాలలో అభిప్రాయభేదాలు వస్తాయి. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.

మీన రాశి
కొన్ని శుభవార్తలు అందుతాయి. వ్యక్తులు చాలా తరచుగా చూడటానికి పొందలేని అవకాశం మీకు లభిస్తుంది. మీ సామర్థ్యం, పనిలో నాణ్యత మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాయి. మీ నిజమైన స్వభావాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఆర్థిక సమస్యలలో పరిష్కారం లభిస్తుంది. కొన్ని విషయాలలో ఒత్తిడి దూరమవుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News