Actress Hema: డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో నటి హేమ..

Bengaluru rave party: బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 3, 2024, 04:37 PM IST
  • హైదరాబాద్ కు చేరుకున్న బెంగళూరు పోలీసులు..
  • నటి హేమను హేమకు మూడోసారి నోటీసులు..
 Actress Hema: డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో నటి హేమ..

Actress Hema Arrested by Bengalur police: బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నటి హేమకు సీసీబీ పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీచేశారు. ఆమె స్పందించకపోవడంతో బెంగళూరు ఈరోజు పోలీసులు నోటీసులు ఆమెను  అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక బెంగళూరు పోలీసులు నటి హేమను రేపు కోర్టులోప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. గత నెల 27వ  తేదీన, ఈ నెల 1 న 41 సీఆర్ పీసీ కింద నోటీసులు జారీచేశారు.

Add Zee News as a Preferred Source

Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..

గత నెల 20 పార్టీలో పాల్గొన్న హేమకు డ్రగ్స్ కేసులో పాటిటివ్ గా రిపోర్టు వచ్చింది. ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్టులు వచ్చాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పోలీసులు 86 మంది వరకు నోటీసులను జారీ చేశారు. ఇక మొదటి నుంచి కూడా నటి హేమ తనకు రేవ్ పార్టీ గురించి సంబంధంలేదని చెప్పుకుంటూ వచ్చింది. అనేక వీడియోలను షేర్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హే స్పందించకపోవడంతో.. ఈరోజు బెంగళూరు పోలీసులు మణికొండ ప్రాంతంలో ఉన్న నటి హేమ ఇంటికి వెళ్లారు.

ఆమెకు మరో నోటీసు ఇచ్చి హేమను అదుపులోకి తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. రేవ్ పార్టీ ఘటనలో పోలీసులు 103 మందికి శాంపుళ్లను తీసుకొగా.. దానిలో 86 మందికి పాజిటివ్ అని తెలింది. ఈ నేపథ్యంలోనే  ఆమెకు పోలీసులు నోటీసులు జారీచేశారు. ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీలో సినిమా, రాజకీయం, పొలిటికల్ రంగాలకు చెందిన వారు ఉన్నారని తెలుస్తోంది. అందరికి కూడా తమ ముందు హజరు కావడనానికి పోలీసులు.. వేర్వేరు తేదీలను ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రేవ్ పార్టీనీ నిర్వహించిన ఫామ్ హోస్ యజమాని గోపాల్ రావ్ కు కూడా క్రైమ్ బ్రాంచీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

 ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.  రేవ్ పార్టీలో ఎవరు డ్రగ్స్ ను సరఫరా చేశారు, దీని వెనుక ఉన్న పెడ్లర్ ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో.. బెంగళూరు పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. నటి హేమ బెంగళూరు పార్టీలో లేనని బుకాయించే ప్రయత్నం చేశారు. బెంగళూరు ఘటనలో దొరికిపోయిన తర్వాత కూడా ఆమె తన ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పడం, పులిహోర వండి వీడియోలు చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ కు గురైంది.

Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..

దీనికి తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పడం, ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పడం కూడా ఆమెకు నెగెటివ్ ఇంప్రెషన్ తెచ్చిపెట్టింది. ఇక బెంగళూరు పోలీసులకు ఆమె తన పేరును కృష్ణవేణి అని చెప్పి బోల్తా కొట్టించే ప్రయత్నం చేసింది.  ఇంత చేసిన కూడా చివరకు నటి హేమ ఎఫ్ఎస్సెల్ టెస్టులలో డ్రగ్స్ తీసుకున్నట్లు అడ్డంగా దొరికిపోయింది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా  మారింది. మరోవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఘటన పెను దుమారంగా మారింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News