National Flag: ప్లాగ్ కోడ్‌లో కీలక మార్పులు..సవరణలకు కేంద్రం పచ్చజెండా..!

National Flag: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జెండా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Written by - Alla Swamy | Last Updated : Jul 23, 2022, 08:35 PM IST
  • కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  • జాతీయ జెండా నిబంధనల్లో మార్పులు
  • సవరణలకు ఆమోదం
National Flag: ప్లాగ్ కోడ్‌లో కీలక మార్పులు..సవరణలకు కేంద్రం పచ్చజెండా..!

National Flag: జాతీయ జెండాకు సంబంధించి కేంద్రప్రభుత్వం కీలక సవరణలు తీసుకొచ్చింది. ప్లాగ్ కోడ్‌లో మార్పులు చేర్పులు చేసింది. ఇకపై మువ్వన్నెల జెండాను పగలే కాకుండా రాత్రి వేళల్లో ఎగుర వేసేలా సవరణలు చేశారు. ఇదివరకు కేవలం చేతితో తయారు చేసిన కాటన్ జెండాలనే ఎగురవేసేవారు. తాజాగా మెషీన్లతో తయారు చేసిన పాలిస్టర్ జెండాలను ఉపయోగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

ఇందులోభాగంగానే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971కు సవరణలు చేసింది. ఇప్పటివరకు వాతావరణంతో సంబంధం లేకుండా జాతీయ జెండాను ఎగుర వేసే అవకాశం ఉంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే మాత్రమే జెండా ఎగుర వేసే అనుమతి ఉండేది. పాలిస్టర్, మెషీన్లతో తయారు చేసే జెండాలను ఉపయోగించుకునేందుకు అనుమతి లేదు.

మరోవైపు అమృత్ మహోత్సవ్‌ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈనేపథ్యంలోనే నిన్న జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీనిపై మంతనాలు కొనసాగుతున్నాయని తెలిపింది. లా కమిషన్‌ పరిశీలిస్తోందని..త్వరలోనే స్పష్టత ఇస్తామని తెలిపింది.

Also read:Bandi Sanjay: మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు వేళాయే..షెడ్యూల్ ఇదే..!

Also read:IND vs WI: వన్డే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంటుందా..రేపే రెండో వన్డే మ్యాచ్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News