Snake in Dream Meaning: కలల గ్రంథం ప్రకారం నిద్రపోతున్నప్పుడు వచ్చే కలలన్ని నిజ జీవితంలో జరిగే సంఘటనలను సూచిస్తుంది. మనిషి నిద్రిస్తున్నప్పుడు వచ్చే కలలలో కొన్ని మంచివి ఉంటే.. మరి కొన్ని కలలు మనిషికి భయం కలిగించేవిగా ఉంటాయి. తరచుగా రోజంతా జరిగిన సంఘటనలను కలలలో మాత్రమే చూస్తారని గ్రంథం చెబుతోంది. నిద్రిస్తున్నప్పుడు కలలో పాములను చూడటం వల్ల శుభం, అశుభాలు జరిగే అవకాశాలున్నాయని గ్రంథం తెలిపింది. కలలో పాము పాకడం, పాముల మధ్యలో వ్యక్తు కనిపించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
1.కలలో పాములు వస్తే ఎలాంటి దోషం:
కలలో బంగారు రంగులో ఉన్న పామును చూసినట్లయితే.. కల గ్రంథం ప్రకారం అది పితృదోషం గురించి చెబుతుంది. మీకు అలాంటి కల కనిపిస్తే.. మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారని అర్థమని గ్రంథం చెబుతోంది. పూర్వీకులను శాంతింపడానికి పూజలు, దానధర్మాలు మొదలైనవి చేయడం మేలని గ్రంథ్రం తెలిపింది.
2. తెలుపు రంగు పాము కనిపిస్తే:
కలలో తెలుపు రంగులో పాము కనిపిస్తే శుభ సంకేతంగా భావిస్తారని గ్రంథం సూచించింది. ఇలాంటి కల వచ్చిన వారు త్వరలో ఎక్కడి నుంచైనా డబ్బు పొందబోతున్నారని అర్థం.
3. చనిపోయిన పామును కనిపిస్తే:
కలలో చనిపోయిన పాము కనిపిస్తే.. అది జాతకంలో రాహు దోషాన్ని సూచిస్తుందని కల గ్రంథంలో చెబుతోంది. రాహువు కారణంగా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని గ్రంథం తెలిపింది. ఈ సమస్యల గురించి పరిష్కారానికి పలు రకాల పూజలు చేయాల్సి ఉంటుందని గ్రంథం సూచించింది.
4. పాము వెంటాడినట్లు కనిపిస్తే:
స్వప్న గ్రంథం ప్రకారం ఒక పాము మిమ్మల్ని కలలో వెంటాడినట్లు కనిపిస్తే.. జీవితంలో చాలా భయపడుతున్నారని లేదా ఎదైన విషయంలో ఆందోళన చెందుతున్నారని గ్రంథం తెలిపింది.
5. పాముల సమూహం కనిపిస్తే:
కల గ్రంథం ప్రకారం కలలో పాముల జెండా కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుందని తెలిపింది. రాబోయే కాలంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్రంథం పెర్కొంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Saturday Shani Mantra: శనివారం ఈ 3 మంత్రాలు పఠిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..
Also Read: Indrakaran Reddy: రాజకీయ లబ్ధి కోసమే యాదాద్రిపై దుష్ప్రచారం: ఇంద్రకరణ్‌రెడ్డి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.