IRCTC Package: ఐఆర్సీటీసీ ఈసారి పూర్తిగా ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజ్ ప్రకటించింది. అందరికీ అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరలో కేవలం 14 వేలకే 8 రోజుల ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజ్ ప్రకటించింది. ఈ ప్యాకేజ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఐాఆర్‌సీటీసీ కొత్తగా భారత్ గౌరవ్ ట్రైన్ సౌజన్యంతో దేశంలోని వివిద ఆధ్యాత్మిక ప్రదేశాల్ని చుట్టి వచ్చే 8 రోజుల ప్యాకేజ్ ప్రకటించింది. అంతేకాదు ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా కేవలం 14 వేలే నిర్ణయించింది. అంటే కేవలం 14 వేలకు దేశంలోని వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలను 8 రోజుల్లో చుట్టి రావచ్చు. ఈ ప్రతిష్టాత్మక టూర్ ప్యాకేజ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.
ప్యాకేజ్ హైలైట్స్ ఇవే
కాశీ-గయ పవిత్ర పిండ దాన యాత్రగా ఐఆర్‌సీటీసీ నామకరణం చేసింది. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్యాకేజ్ పలు ఆకర్షణీయమైన గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. ప్రయాణీకులు 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్ తరగతుల్లో తమ స్థోమతను బట్టి ప్రయాణం చేయవచ్చు. ఈ జర్నీలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలైన గయా, బెనారస్, ప్రయాగ్‌రాజ్ వంటివి ఉంటాయి. ఈ ప్యాకేజ్ గురించి మరిన్ని ఇతర వివరాలకై ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ https://irctctourism.com/. సందర్శించగలరు.
ఈ ప్యాకేజ్‌లో 8 రోజులు, 7 రాత్రుళ్లు ఉంటాయి. సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట,పెందుర్తి, విజయనగరం, పలాస , బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్ స్టేషన్లలో బోర్డింగ్, డీ బోర్డింగ్ ఉంటుంది. ఈ యాత్ర అక్టోబర్ 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది.
ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజ్ మూడు రకాల ప్యాకేజ్‌లు ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్‌లో ఉన్నాయి. ఇక వీటి ధరలు 13,900 రూపాయల నుంచి ప్రారంభమై గరిష్టంగా 29,300 ఉంటుంది. 13,900 రూపాయల ప్రారంభ ప్యాకేజ్‌లో 8 రోజుల రైలు ప్రయాణం, గయా, బెనారస్, ప్రయాగ్‌రాజ్ వంటి ఆకర్షణీయ ప్రాంతాల్ని కలుకుని ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతిని ఆస్వాదించడం, అణ్వేషించడం లక్ష్యంగా ఈ జర్నీ ఉంటుంది.
ఐఆర్‌సీటీసీ-భారత్ గౌరవ్ ట్రైన్ టూర్ ప్యాకేజ్ అనేది ఎవరికీ ఆర్దిక భారం కాకుండా అద్భుతమైన ప్రయాణ అనుభూతి, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శనను చేయిస్తుంది. దేశం నడిబొడ్డు నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook