Weekly Horoscope: వార ఫలాలు.. ఆ 2 రాశుల వారికి చాలా శుభప్రదం.. మిగతా రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే..

Weekly Horoscope Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... జూన్ 6 నుంచి జూన్ 12 వరకు రాశిచక్రంలోని రెండు రాశుల వారికి చాలా శుభప్రదమైనది. మిగతా రాశుల్లో కొన్ని రాశుల వారికి కీలక జాగ్రత్తలు సూచించబడ్డాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2022, 08:51 AM IST
  • ఈ వారం రాశి ఫలాలు
  • ఆ రెండు రాశుల వారికి శుభ ఫలాలు
  • మిగతా రాశుల్లో కొందరికి కీలక సూచనలు
  • ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి
Weekly Horoscope: వార ఫలాలు.. ఆ 2 రాశుల వారికి చాలా శుభప్రదం.. మిగతా రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే..

Weekly Horoscope Predictions: రానున్న వారం రోజుల్లో కుంభ రాశి యువత తమ క్లీన్ ఇమేజ్‌ని కాపాడుకోవాలంటే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి. మీన రాశి యువతకు కాస్త ఓపిక అవసరం. అలా అయితేనే పనులు ముందుకు సాగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం కలిస్తుంది. ప్రస్తుత వారంలో రాశిచక్రంలోని 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మేషం, కుంభం :

మేషరాశి యువకులు స్నేహం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్నేహితుల ప్రభావం మీ పనిపై పడుతుంది. వ్యక్తిగత విషయాలను కూడా ప్రభావితం చేస్తుంది.  కాబట్టి కొత్త స్నేహాల విషయంలో ఆచీ తూచీ వ్యవహరించాలి. కొంతమంది స్నేహితుల వల్ల మీ ఇమేజ్ చెడిపోవడం జరగకూడదు. కుంభ రాశి యువకులు డ్రగ్స్ అలవాటు ఉన్న స్నేహితులకు దూరంగా ఉండాలి. మీరు డ్రగ్స్ బానిసలతో సహవాసం చేస్తే, దాని ప్రభావం మీ ఇమేజ్‌పై కూడా ప్రభావం చూపుతుంది. ఏ వ్యక్తి అయినా తన క్లీన్ ఇమేజ్‌ని సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది.. కానీ పోగొట్టుకోవడానికి నిమిషం చాలు. కాబట్టి చెడు సహవాసాల జోలికి వెళ్లవద్దు.

జెమిని-ధనుస్సు :

మిథున రాశి యువకులు తమ స్నేహితులతో గొడవ పడే అవకాశం ఉంది. మిత్రులతో విభేదాలు మంచివి కాదు. సంక్లిష్ట పరిస్థితుల్లో ఓపికతో, సంయమనంతో వ్యవహరించండి. మీ అంతరాత్మ ప్రబోధానుసారం ముందుకు సాగండి. దుందుడుకు తనం పనికిరాదు. ధనుస్సు రాశి యువకులు చిన్న విషయాలకు చిన్న చిన్న విషయాలకే కోపతాపాలకు గురికావొద్దు. అది అశాంతికి దారితీస్తుంది.

మీనం-వృశ్చికం :

మీన రాశి యువత కూడా తమ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇతరుల మాటలు ఓపికగా వినడం అలవాటు చేసుకోవాలి. మొత్తం వినకుండా ఇతరుల మాటలకు అడ్డుపడవద్దు. ఎప్పుడూ మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. వృశ్చికరాశి యువకులు ఉద్యోగం, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే ప్రణాళిక ఉంటుంది, చివరి క్షణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాస్‌పోర్ట్‌లు తదితరాలను ముందుగానే తయారు చేసుకోవాలి.

వృషభం, మకరం, సింహం :

వృషభ రాశి యువతకు ఈ వారం మంచి రోజులు. రచయితలు, రచయిత్రులైన యువతకు మంచి అవకాశాలు లభిస్తాయి. వారి కథనాలను వార్తాపత్రిక, మ్యాగజైన్ లేదా డిజిటల్ మీడియాలో ప్రచురితం కావొచ్చు. ఇది వారికి ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. మకర రాశి యువత కూడా ఈ వారం మంచి అనుభూతిని పొందుతారు. తమ ప్రసంగాలు, వాక్చాతుర్యంతో ప్రజలను ఆకర్షిస్తారు. సింహ రాశి ప్రజలు తమ దృష్టిని జ్ఞాన సముపార్జన కోసం మాత్రమే కేంద్రీకరించాలి, జ్ఞానాన్ని పొందేందుకు పరిమితి లేదు. జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే జీవితంలో పురోగతికి మార్గం సుగమం అవుతుంది.

కన్య, కర్కాటక రాశి :

కన్యారాశి యువకుల తెలివితేటలు చాలా పదునైనవి. కాబట్టి వారు దానిని సానుకూలంగా ఉపయోగించుకుని లక్ష్యాన్ని సాధించాలి. కర్కాటక రాశి యువకులు ఈ వారం తమ స్నేహితులను కలుస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. వారి సలహాలు, సూచనలు వినండి. తొందరపాటు చర్యలు మంచివి కాదు.

(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. Zee News దీన్ని ధ్రువీకరించలేదు.)

Also Read: Jubilee Hills Gang Rape: బాధితురాలి ఫోటోలు, వీడియోలు లీక్ చేసింది అతనే..? పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు..

Also Read: Rahu Transit 2022: జూన్ 14 నుంచి ఈ 3 రాశుల వారిపై రాహువు కాసుల వర్షం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News