Kubera Worship Benefits: లక్ష్మీ దేవితో పాటు కుబేరున్ని పూజిస్తే ఇంట్లో ధనప్రాప్తి తథ్యం!

Kubera Worship Benefits: హిందూ శాస్త్రాల ప్రకారం లక్ష్మీ దేవిని స్మరించడం వల్ల ఆమె అనుగ్రహంతో ధనప్రాప్తి లభిస్తుందని నానుడి. కానీ, లక్ష్మీ దేవితో పాటు సంపదకు అధిపతి అయిన కుబేరుని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కుబేరుని పూజించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. అవేంటో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 12:55 PM IST
    • ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కోసం లక్ష్మీ దేవీ పూజ
    • ఆమెతో పాటు సంపదకు అధిపతి కుబేరుని ప్రసన్నం ముఖ్యం
    • పూజామందిరంలో కుబేరుని యంత్రంతో శ్రేయస్కరం
Kubera Worship Benefits: లక్ష్మీ దేవితో పాటు కుబేరున్ని పూజిస్తే ఇంట్లో ధనప్రాప్తి తథ్యం!

Kubera Worship Benefits: హిందూ సంప్రదాయం ప్రకారం సంపదకు అధిపతి కుబేరుడు. పరమ శివుని ద్వారపాలకుడిగానూ ఈయన్ని పరిగణిస్తారు. కుబేరునితో పాటు సంపద పొందడానికి లక్ష్మీ మాతను పూజిస్తారు. లక్ష్మి మాతతో పాటు కుబేరుడ్ని ఆరాధించడం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 

హిందూ మత గ్రంధాల ప్రకారం.. కేవలం లక్ష్మీ మాతను ఆరాధించడం వల్ల అంతటి ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ, సంపదకు అధిపతి అయిన కుబేరుడ్ని ప్రసన్నం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని తెలుస్తోంది. 

గృహంలోని ఈశాన్య దిశలో కుబేరుని స్థాపన

నివాసంలోని ఈశాన్య దిక్కును శుభ్రం చేసి గంగాజలంతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత మల్లె నూనె, ఒక తెల్లని కొవ్వొత్తిని వెలిగించాలి. ఆ తర్వాత కుబేరున్ని స్మరిస్తూ.. ఆ ప్రతిమ లేదా విగ్రహానికి పూజ చేయాలి. అలా చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. 

కుబేర మంత్రం పఠించాలి..

ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత, ముత్యాల మాలను చేతిలోకి తీసుకొని.. 'ఓం శ్రీం, ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ: నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలా జపించడం వల్ల కుబేరుని అనుగ్రహం ఉంటుంది.

కుబేర యంత్ర పూజ

కుబేర యంత్రాన్ని ఆరాధించడం వల్ల ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. బంగారం, వెండి లేదా పంచలోహాల్లో ఏదైనా ఒకదానిలో కుబేరుని యంత్రాన్ని పూజా మందిరంలో ప్రతిష్టించాలి. ప్రతిరోజూ ఈ యంత్రాన్ని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అంతే కాకుండా దురదృష్టాలు దూరమవుతాయి. 

త్రయోదశి నాడు కుబేరుని ఆరాధన శ్రేయస్కరం

సంపదకు అధిపతి కుబేరున్ని నిర్దిష్టమైన తేదీలో పూజ చేయడం శ్రేయస్కరం. ప్రతి నెలా త్రయోదశి రోజున ఉదయాన్ని నిద్రలేచి, స్నానం చేయాలి. ఆ తర్వాత ప్రార్థనా స్థలాన్ని శుభ్రం చేసి.. కుబేరుని యంత్రాన్ని ముందు ఉంచుకొని పూజించాలి. ఆ తర్వాత మనసులోని కోరిక కోరుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది. 

(నోట్: పైన పొందుపరిచిన సమాచారం శాస్త్రాలు ద్వారా గ్రహించినది. దీన్ని ZEE తెలుగు NEWS ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Lucky Moles: మీరు ఎంతటి అదృష్టవంతులో ఆ పుట్టుమచ్చల ద్వారా తెలుసుకోండి!

Also Read: Garuda puranam: గరుడ పురాణం రహస్యం.. ఇలాంటి వాళ్లకు లక్ష్మీ కటాక్షం చాలా ఉంటుందట..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News