Malavya Yoga Benefits 2024: మార్చి 31న శక్తివంతమైన మాలవ్య యోగం ఏర్పాటు.. ఈ రాశుల వారికి లాభాలే లాభాలు!

Malavya Yoga Benefits 2024 In Telugu: మార్చి 31వ తేదీన ఏర్పడబోయి ప్రత్యేక రాజయోగం కారణంగా చాలా రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా విపరీతమైన డబ్బు లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 29, 2024, 09:21 AM IST
Malavya Yoga Benefits 2024: మార్చి 31న శక్తివంతమైన మాలవ్య యోగం ఏర్పాటు.. ఈ రాశుల వారికి లాభాలే లాభాలు!

 

Malavya Yoga Benefits 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం యోగాలు ఏర్పడడం శుభ సూచిక భావిస్తారు. మార్చి 31వ తేదీన మీనరాశిలో ఏర్పడే మాలవ్య యోగం మే 19 వ తేదీ వరకు ఉంటుంది. అయితే ఇదే సమయంలో శుక్ర గ్రహం కూడా వృషభరాశిలోకి సంచారం చేస్తుంది. శుక్రుడు తన లగ్నంలో మొదటి, నాల్గవ, సప్తమ స్థానాల్లో సంచారం చేయడం కారణంగా ఈ ప్రత్యేకమైన యోగం ఏర్పడుతుంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర గ్రహాన్ని ఆనందం, సంపద, శ్రేయస్సుకు ప్రధాన కారకుడిగా పరిగణిస్తారు. ఈ సమయంలో జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉన్నవారికి శుక్ర దేవుడి అనుగ్రహం లభించి ఆనందం, శ్రేయస్సు, ధనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. మార్చి 31వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు శుక్ర గ్రహం మీన రాశిలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగానే శుక్రుడు లగ్నంలోకి రాగానే మాళవ్య రాజ్యయోగం ఏర్పడుతుంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ యోగం పంచ మహాపురుష యోగాలలో ఒకటి. ఈ యోగం ఏర్పడడం కారణంగా అనేక రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో ఉన్న సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.

ఈ యోగం కారణంగా లాభాలు పొందబోయే రాశుల వారు వీరే:
కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు మార్చి 31 నుంచి మే 19 వరకు విశేష ప్రయోజనాలను పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు లభించి, ఆస్తులతోపాటు కార్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతులు లభించి, జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేస్తున్న వారి విషయానికొస్తే ఈ సమయంలో మళ్లీ కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. 

తులారాశి:
తులారాశి వారికి కూడా ఈ ప్రత్యేక యోగ ప్రభావం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి పనుల్లో ప్రశంసలు లభించడమే కాకుండా ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల సపోర్టు లభించి, విపరీతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు ఈ సమయంలో ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతారు. అలాగే సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా పేరు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. దీంతోపాటు మీపై మీకు విశ్వాసం పెరిగి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

మీన రాశి:
మీన రాశి వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా స్నేహితులతో కలిసి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. కుటుంబ జీవితం గడుపుతున్న వారు విపరీతమైన ఆనందాన్ని కలిగి ఉంటారు. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News