Horoscope March 2 2022: ఈ రోజు మాఘ అమావాస్య.. ఈ 4 రాశులపై తీవ్ర ప్రభావం చూపనుంది

Today Horoscope: నేడు (March 2 2022) మాఘ అమావాస్య. ఏయే రాశులపై (Zodiac signs) ఎలాంటి ప్రభావం చూపనుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 07:52 AM IST
Horoscope March 2 2022: ఈ రోజు మాఘ అమావాస్య.. ఈ 4 రాశులపై తీవ్ర ప్రభావం చూపనుంది

Horoscope March 2, 2022: సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం, అమావాస్యను అశుభ దినంగా పరిగణిస్తారు. ఈ రోజు ఎలాంటి పనులు చేపట్టకూడదు అంటారు. ఈ నేపథ్యంలో నేడు (March 2 2022) సంభవించబోయే అమావాస్య (New Moon) ఏయే రాశులపై (Horoscope March 2, 2022) ఎలాంటి ప్రభావం చూపనుందో ఓ లుక్కేద్దాం. 

మేషం (Aries) : ఈ రాశివారికి మిశ్రమ కాలం నడుస్తోంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కచ్చిమైన ప్రణాళికతో పనులు పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతతను పొందేందుకు ప్రయత్నిస్తారు. 

వృషభం (Taurus) : ఈరోజు ఈ రాశివారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక విషయంలో తోటివారి  సాయం అందుతుంది. ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు.

మిథునం (Gemini) : మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం అందుతుంది. శత్రువులను తక్కువగా అంచనా వేయవద్దు. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వింటారు. 

కర్కాటకం (Cancer):  కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ అధికమవుతుంది. గొదవలకు దూరంగా ఉంటే మంచిది. 

సింహం (Leo) : ఈ రోజు ఈ రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సహాయం అందుతుంది. కీలక విషయాల్లో మెదడు చురుకుగా పనిచేస్తుంది. మీ భావోద్వేగాలను నియంత్రించడం మానేయండి.

కన్య (Virgo):  ఈ రాశివారికి లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.

తుల (Libra):  వీరు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. విహారయాత్రలు, పనిపై ఇతర ప్రదేశాలకు వెళ్లడం లాంటి ప్రణాళికలు రచిస్తారు.

వృశ్చికం (Scorpio) : ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల వద్ద అణిగిమణిగి ఉండాల్సి వస్తోంది.

ధనుస్సు ((Sagittarius): దనస్సు రాశి వారికి ఈ అమావాస్య  అంతగా కలిసిరాకపోవచ్చు. వీరు కీలక వ్యవహారాల్లో తోటివారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి మేధస్సుతో కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. 

మకరం (Capricorn) : ఈ రోజు ఈ అమావాస్య మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇతరులతో మాట్లాడటం ద్వారా మీరు ఒంటరితనాన్ని దూరం చేసుకోవచ్చు.

కుంభం (Aquarius) : ఈ రాశివారికి సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఆనందకరమైన జీవితాన్నిగడుపుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. 

మీనం (Pisces) :  ఈ అమావాస్య మీకు అదృష్టం తెచ్చిపెడుతుంది. మనోబలంతో పనులు పూర్తి చేస్తారు.  ఆత్మీయులు ప్రేమాభిమానాలు పొందుతారు. సానుకూల ఫలితాలు ఉన్నాయి. ధనలాభం కూడా ఉంది.  

Also Read: Astrology Predictions: ఈ పేర్లు ఉన్నవారు చిన్న వయసులోనే ధనవంతులు అవుతారు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x