March Month Leo sign Horoscope 2024: సింహ రాశివారి మార్చి నెల ఫలాలు.. లాభాలతో పాటు నష్టాలు తప్పవా?

March Month Leo sign Horoscope 2024: సింహ రాశి వారికి మార్చి నెలలో జరిగే గ్రహ సంచారాల కారణంగా లాభాలతో పాటు నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశివారికి ముందు వారం నుంచి చివరి వారం వరకు ఎలా ఉందబోతుందో తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2024, 01:35 PM IST
March Month Leo sign Horoscope 2024: సింహ రాశివారి మార్చి నెల ఫలాలు.. లాభాలతో పాటు నష్టాలు తప్పవా?

March Month Leo sign Horoscope 2024 In Telugu: మార్చి నెలల అన్ని రాశులతో పాటు సింహ రాశి రాశివారిపై కూడా ప్రత్యేక్ష ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఈ నెలలో జరిగే గ్రహ సంచారాల ప్రభావం వీరిపై ప్రత్యేక్షంగా పడుతుంది. దీని కారణంగా సింహ రాశి వారి జీవితంలో మొదటి వారం కొన్ని మార్పులు జరుగుతాయి. దీంతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ మార్చి నెలలో సింహ రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

సింహ రాశి - మార్చి 2024 రాశి ఫలాలు
సాధరణ ఫలాలు:

ఈ నెల  సింహ రాశి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. దీని కారణంగా వీరు కొత్త అవకాశాలు పొందుతారు. అంతేకాకుండా లాభాలతో పాటు సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ధైర్యంగా ఉండడం వల్ల లక్ష్యాలను సాధించగలుగుతారు. ఈ నెల మీకు చాలా శక్తిని, ఉత్సాహం కలుగుతుంది. మీరు కొత్త పానులను ప్రారంభించడానికి, కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టడానికి ఇది మంచి సమయంగా భావించవచ్చు.

వృత్తి:
మీ వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోంటారు. దీని కారణంగా పని భారం పెరగవచ్చు. అయితే మీకు ఉండే ప్రతిభతో అన్ని సవాళ్లను అధిగమిస్తారు. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి. మీ ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ నెల మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు.

ఆర్థిక పరిస్థితి:
ఈ మార్చి నెల ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అనవసరానికి మంచిని ఖర్చులను చేయకూడదు. పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. మీరు ఈ నెల చివర కొన్ని ఆర్థిక లాభాలను కూడా పొందుతారు.

వ్యక్తిగత:
మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగించండి. స్నేహితులతో సరదాగా గడపడానికి అవకాశం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఆటుపోట్లు ఉండవచ్చు. కాబట్టి ఓపికతో ఉండండి..దీంతో పాటు మీ భాగస్వామితో మంచి సంభాషణలు కొనసాగించండి.

ఆరోగ్యం:
ఆరోగ్యం పరంగా మార్చి నెల మీకు చాలా  బాగుంటుంది. అయితే ఈ సమయంలో తీసుకునే ఆహారాలు, వ్యాయామం పట్ల శ్రద్ధ వహించండి. ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. యోగా, ధ్యానం చేయడం మర్చి పోకండి.

పరిహారం:
ప్రతిరోజూ సూర్యుడికి నమస్కారం చేయండి. దీంతో ప్రతి ఆదివారం శివునికి పూజ చేయండి. "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని జపించండి.

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

గుర్తుంచుకోండి:
ఈ నెల మీకు కొన్ని సవాళ్లను ఎదురయ్యే ఛాన్స్‌ ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. అంతేకాకుండా సానుకూల దృక్పథంతో నడుచుకోవడం చాలా మంచిది. ఈ నెల మీకు చాలా అవకాశాలను కలిగే ఛాన్స్‌ ఉంది.

నక్షత్రాల ప్రభావం:
మఘ: ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు.
పుబ్బ: మీ వృత్తి జీవితంలో కొన్ని ఒత్తిళ్లు ఎదురవ్వొచ్చు. ఓపికగా ఉండడం వల్ల మంచి లాభాలు పొందుతారు.
ఉత్తర: మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News