Margashira Masam 2022: మార్గశీర మాసం వచ్చే పండగలు..ఉపవాసాలు ఆచరిస్తే కలిగే ప్రయోజనాలు..

Margashira Masam 2022: మార్గశీర మాసం హిందువులకు ఎంతో ప్రముఖ్యమైన నెలగా శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో ఉపవాసాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ మాసంలో ప్రత్యేక పండగలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2022, 02:06 PM IST
Margashira Masam 2022: మార్గశీర మాసం వచ్చే పండగలు..ఉపవాసాలు ఆచరిస్తే కలిగే ప్రయోజనాలు..

Margashira Masam 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం.. సంవత్సరంలో తొమ్మిదవ నెల మార్గశీర మాసం అని అంటారు. ఈ మాసాన్ని అఘన మాసం అని కూడా అంటారు. అయితే ప్రతి నెలకు గాను ఓ ప్రత్యేకత ఉంటుంది. మార్గశీర మాసంలో శ్రీకృష్ణునికి పూజించడం ఆనవాయిగా వస్తోంది. అందుకే ఈ క్రమంలో కృష్ణుడిని తలుచుకుని పూజా కార్యక్రమలు చేస్తారు. అంతేకాకుండా ఆయనకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి..మంత్రాలు పఠిస్తారు. ఇలా చేయడం వల్ల కృష్ణుడి అనుగ్రహం లభించి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

మార్గశీర మాసంలో ఉపవాసాలు కూడా పాటిస్తారు. అయితే ఈ క్రమంలో వివాహం వంటి శుభ కార్యాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మాసాన్ని స్వర్ణయుగం అని కూడా అంటారని శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ మాసంలో పెద్ద పండగ లేకపోయినా ఎంతో ప్రత్యేకత కలిగిన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో వివాహ పంచమి, ఉత్పన ఏకాదశి, మోక్షదా ఏకాదశి, గీతా జయంతి ప్రత్యేక రోజుల్లో ఉపవాసాలు ఆచరిస్తారు. అయితే ఈ నెలలో వచ్చే పండగలు ఇతర ప్రత్యేకమైన రోజుల గురించి తెలుసుకుందాం..

2022 మార్గశీర మాసంలో పండుగలు, ఉపవాసాల తేదీలు:
9 నవంబర్ 2022 2022, బుధవారం- మార్గశీర మాసం ప్రారంభమవుతుంది.
11 నవంబర్ 2022, శుక్రవారం - సౌభాగ్య సుందరి వ్రతం
12 నవంబర్ 2022, శనివారం - గణాధిప సంక్షోభ చతుర్థి
16 నవంబర్ 2022, బుధవారం - కాల భైరవ జయంతి, వృశ్చిక సంక్రాంతి
20 నవంబర్ 2022, ఆదివారం - ఉత్తాన ఏకాదశి
21 నవంబర్ 2022, సోమవారం - సోమ ప్రదోష వ్రతం
22 నవంబర్ 2022, మంగళవారం - మార్గశీర మాస శివరాత్రి
23 నవంబర్ 2022, బుధవారం - మార్గశీర అమావాస్య
27 నవంబర్ 2022, ఆదివారం - వినాయక చతుర్థి
28 నవంబర్ 2022, సోమవారం- వివాహ పంచమి
29 నవంబర్ 2022, మంగళవారం - చంపా షష్ఠి
3 డిసెంబర్ 2022, శనివారం - మోక్షద ఏకాదశి, గీతా జయంతి
4 డిసెంబర్ 2022, ఆదివారం - వైష్ణవ మోక్షద ఏకాదశి
5 డిసెంబర్ 2022, సోమవారం- త్రయోదశి వ్రతం, సోమ ప్రదోష వ్రతం
7 డిసెంబర్ 2022, బుధవారం- అన్నపూర్ణ జయంతి, పూర్ణిమ వ్రతం, సత్య వ్రతం
8 డిసెంబర్ 2022, గురువారం - అఘన పూర్ణిమ, మార్గశీర పూర్ణిమ

Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే

Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News