Budh Gochar 2022: గ్రహాల దిశ వ్యక్తి తలరాతను నిర్ణయిస్తుంది. ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం, తిరోగమనం మరియు సంయోగం చాలా ముఖ్యమైనవి. గ్రహాల స్థితిని బట్టి మీ ప్యూచర్ ను చెప్పేయచ్చు. తెలివితేటలు, కమ్యూనికేషన్ కు కారకుడిగా బుధుడిని (mercury Planets) భావిస్తారు. అక్టోబరు 26న బుధుడు తులరాశిలోకి ప్రవేశించాడు. తులరాశిలో ఇప్పటికే కేతువు, శుక్రుడు, సూర్యుడు ఉన్నాడు. తులారాశిలో బుధుడు, శుక్రుడు కలిసి లక్ష్మీనారాయణ యోగాన్ని ఏర్పరుస్తున్నారు. దీంతో ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
లక్ష్మీనారాయణ యోగం ఈరాశులకు శుభప్రదం
కన్య (Virgo): ఈ రాశి వారికి మహాలక్ష్మీ నారాయణ యోగం శుభప్రదం కానుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఈ రాశివారిపై ధనవర్షం కురుస్తుంది. ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారులకు భారీ లాభాలు ఉంటాయి. ఉద్యోగులు జీతం పెరగవచ్చు.
ధనుస్సు రాశి (Sagittarius): ఈ రాశి వారికి బుధ-శుక్రుల కలయిక వల్ల ఏర్పడే లక్ష్మీ-నారాయణ యోగం ఏర్పడతుంది. ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. ప్రతి పనిలో విజయం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం, ఆదాయం పెరుగుతాయి.
మకరరాశి (Capricorn): బుధ-శుక్రుల కలయికతో మకరరాశి వారు ఉద్యోగ, వ్యాపారాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉండటంతో మీకు గౌరవం కూడా లభిస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. భారీగా డబ్బు సంపాదిస్తారు.
Also Read: Shani Dev: జనవరి 17 వరకు ఈ రాశులవారికి కష్టాలు, శనిపీడ నుండి విముక్తికి ఇలా చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి