Akhand Samrajya Rajyog: బుధుడి యెుక్క 'అఖండ సామ్రాజ్య రాజయోగం'.. ఈ మూడు రాశులకు లాభం..

Akhand Samrajya Rajyog:  ప్రస్తుతం బుధుడు తులరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా 'అఖండ సామాజ్ర్య రాజయోగం' ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2022, 12:38 PM IST
Akhand Samrajya Rajyog: బుధుడి యెుక్క 'అఖండ సామ్రాజ్య రాజయోగం'.. ఈ మూడు రాశులకు లాభం..

Akhand Samrajya Rajyog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిచక్రాన్ని మారుస్తాయి. ఈ గ్రహ మార్పు కొందరికి శుభం, మరికొందరికి అశుభం. ప్రస్తుతం మెర్క్యూరీ తులారాశిలో సంచరిస్తుంది. దీని కారణంగా 'అఖండ సామాజ్ర్య రాజయోగం' (Akhand Samrajya Rajyog) ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. మీరు కెరీర్ మరియు వ్యాపారంలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం (Aries): ఈ రాశివారికి అఖండ సామ్రాజ్య రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి ఏడవ ఇంటిలో సంచరించింది. ఇది భాగస్వామ్య మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రదేశంగా భావిస్తారు. దీంతో మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే పార్టనర్ షిప్ తో పనిచేసే పనుల్లో విజయం సాధిస్తారు. మీరు స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేటివ్ లాటరీలలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు వ్యాపారాల్లో భారీగా లాభాలను ఆర్జిస్తారు. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. 

మకరం (Capricorn): అఖండ సామ్రాజ్య రాజయోగం ఈ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో విజయాన్నిస్తుంది. ఎందుకంటే మీ రాశి నుండి పదో ఇంట్లో బుధుడు సంచరించాడు. ఇది పని చేసే క్షేత్రంగా మరియు ఉద్యోగ స్థలంగా పరిగణించబడుతుంది. నిరుద్యోగులు కొత్త జాబ్ ను పొందుతారు. ఉద్యోగస్తుల ఆదాయం పెరుగుతుంది. మీరు రుణ విముక్తి పొందుతారు. 

కర్కాటకం (Cancer): అఖండ సామ్రాజ్య రాజయోగం మీకు ఆర్థికంగా బాగుంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి నాల్గవ ఇంటిలో సంచరించింది. ఇది భౌతిక ఆనందం మరియు తల్లి యొక్క ప్రదేశంగా భావిస్తారు. దీంతో మీ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆస్తిని కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం.

Also Read: Mars retrograde 2022: 73 రోజులపాటు తిరోగమనంలో కుజుడు... ఈ 3 రాశులవారికి ఆకస్మిక ధనం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U   

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News