Mirror Vastu Tips: ఇంట్లో అద్దం ఏ దిశలో ఎక్కడ ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుంది

Mirror Vastu Tips: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఇళ్లు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే వివరాలతో పాటు ఏది ఉండవచ్చు , ఏది ఉండకూడదనే సమాచారం కూడా ఉంటుంది. అదే సమయంలో ఏ వస్తువు ఎక్కడుండాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 22, 2023, 05:27 PM IST
Mirror Vastu Tips: ఇంట్లో అద్దం ఏ దిశలో ఎక్కడ ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుంది

Mirror Vastu Tips: వాస్తు శాస్త్రంలో ప్రతి విషయం గురించి వివరణ ఉంటుంది. వాస్తు ప్రకారం ఉంటే ఏమౌతుంది, లేకపోతే కలిగే అనర్ధాలేంటనే వివరాలుంటాయి. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుండాలనేది వాస్తు శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంది. ఆ వివరాలు మీ కోసం.

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదనే వివరాలు ప్రస్తావించి ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులు సరైన దిశలో సరైన స్థానంలో ఉండటం వల్ల కలిగే అమితమైన లాభాలుంటాయి. ఇందులో అతి ముఖ్యమైంది అద్దం. ఇంట్లో అద్దం ఆ స్థానంలో ఉంటే చాలా వేగంగా డబ్బు అభివృద్ది చెందుతుంది.

ముందుగా చెప్పినట్టే వాస్తు శాస్త్రంలో ప్రతి చిన్న విషయం గురించి ప్రస్తావన ఉంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడంతో అద్దం కీలకంగా ఉపయోగపడుతుందంటారు జ్యోతిష్యులు. ఇంట్లో అద్దాన్ని సరైన స్థానంలో ఉంచితే లెక్కలేనన్ని ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచే ప్రతి వస్తువుకు పాజిటివ్ లేదా నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. అదే విధంగా అద్దానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇంట్లో అద్దాన్ని సరైన దిశలో ఉంచితే  ఆ ఇంటి సభ్యుల అదృష్టం కొద్దిరోజుల్లోనే వికసిస్తుంది. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాన్ని శక్తివంతమైన వస్తువుగా భావిస్తారు. అద్దంతో చేసిన ఏ వస్తువుకైనా రెండింతలు చేసే సామర్ధ్యముంటుందనేది జ్యోతిష్యుల నమ్మకం. అద్దం అమర్చేటప్పుడు కొన్ని విషయాలు పరిగణలో తీసుకుంటే ఆ వ్యక్తి ముందు అభివృద్ధి పథం తెర్చుకుంటుంది. డబ్బులు కూడా పెరుగుతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాన్ని ఎప్పుడూ ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో గోడకు అమర్చాలి. దక్షిణం, పశ్చిమ దిశల్లో గోడకు అమర్చకూడదు. దక్షిణ లేదా పశ్చిమ దిశల్లో గోడకు అమర్చడం వల్ల ఇంట్లో అశాంతి వాతావరణం కలుగుతుంది. వాస్తు పండితుల ప్రకారం అద్దం ఎప్పుడూ వృత్తాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంలోనే ఉండాలి. ఎందుకంటే ఇలాంటి అద్దం ఎనర్జీని సమానంగా వ్యాపింపచేస్తుంది. ఓవల్ లేదా గోళాకారంలో ఉండే అద్దాలు మంచివి కావని నమ్ముతారు. ఇలాంటివి ఇళ్లలో లేదా ఆఫీసుల్లో అమర్చకూడదు. అయితే అద్దం పరిమాణం ఎంంతైనా ఉండవచ్చు.

ఇక మాస్టర్ బెడ్రూంలో అద్దం అనేది ప్రతి ఇంట్లో తప్పకుండా కన్పిస్తుంది. సాధారణంగా గోడకు లేదా ఏదైనా కేబినెట్ లేదా డ్రెస్సింగ్ టేబుల్‌కు ఉంటుంది. అయితే సాధ్యమైనంతవరకూ బెడ్ ముందు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఒకవేళ ఇలా సాధ్యం కాకపోతే ఏదైనా వస్త్రాన్ని కప్పి ఉంచాలి. వాస్తు ప్రకారం ఇంట్లో లాకర్ ముందు అద్దం ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల ఖజానాలో డబ్బులు పెరుగుతాయని నమ్మకం. 

ఉత్తర దిశలో అద్దాన్ని అమర్చుకుంటే చాలా లాభదాయకమంటారు. ఉత్తర దిశ అనేది ధనదేవత కుబేరుడికి కేంద్రమని నమ్మకం. అందుకే ఈ దిశలో అద్దం అమర్చడం వల్ల డబ్బుకు లోటుండదు. ఒకవేళ మీది వ్యాపారమైతే క్యాష్ బాక్స్ పక్కనే అద్దం ఉంటే మంచిది. ఇలా చేయడం వల్ల వ్యాపారం పెరగడమే కాకుండా లాభాలు ఆర్జిస్తారు. 

Also read: Astro Tips: ఈ ఐదు రాశులకు తస్మాత్ జాగ్రత్త, రానున్న 30 రోజులు అన్నీ ఇబ్బందులే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News