Mithun Sankranti 2022: సూర్యుడు మిథునరాశిలో ప్రవేశించిన రోజున మిథున సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ సారి మిథున సంక్రాంతిని (Mithun Sankranti 2022) రేపు అంటే జూన్ 15న జరుపుకుంటున్నారు. ఈ రోజును వర్షాకాలం ప్రారంభంగా భావిస్తారు. ఈ రోజున ప్రజలు సూర్య భగవానుని ఆరాధిస్తూ మంచి వర్షాలు కురవాలని ప్రార్థిస్తారు.
మిథున సంక్రాంతి ప్రాముఖ్యత
మిథున సంక్రాంతికి హిందూమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంక్రాంతిని దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు. మిథున సంక్రాంతి రోజున వర్షాకాలం ప్రారంభమై.. మనందరికీ వేడిమి నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. దీనితో పాటు, ఈ రోజు మంచి పంట కోసం పూజలు కూడా చేస్తారు. మిథున సంక్రాంతి రోజున సూర్యదేవుని పూజిస్తారు.
సిల్బట్టాను పూజిస్తారు
మిథున సంక్రాంతి రోజున కూడా సిల్బట్టా (Silbatte) పూజ చేస్తారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అయితే అందులో ఓ ప్రత్యేకత దాగి ఉంది. స్త్రీలకు ప్రతినెలా రుతుక్రమం వచ్చినట్లే, అదే విధంగా మిథున సంక్రాంతికి ముందు మరియు తర్వాత రోజుతో కలిపి మొత్తం మూడు రోజుల పాటు మాతృమూర్తికి కూడా రుతుక్రమం ఉంటుంది. ఆ తర్వాత నాల్గవ రోజున భూమాత స్నానం చేస్తుంది. సిల్బట్టా మాతృభూమి రూపంగా పరిగణించబడుతుంది, అందుకే సిల్బట్టా మూడు రోజులు ఉపయోగించబడదు. దీని తరువాత, నాల్గవ రోజు, సిల్బట్టా నీటితో మరియు పాలతో స్నానం చేసి పూజిస్తారు.
దానం కూడా ముఖ్యం
మిథున సంక్రాంతి రోజున దాతృత్వానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని మీకు తెలియజేద్దాం. ఈ రోజు పూజానంతరం గోధుమలు, బెల్లం, నెయ్యి, ధాన్యాలు మొదలైన వాటిని దానం చేయాలి.
Also Read: Sun Transit 2022: రేపు మిథునరాశిలోకి సూర్యుడు... ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook