Rasi Phalalu: ఈ రాశులవారిపై 2024లో లక్ష్మీదేవి అనుగ్రహం..అదృష్టం వరించబోతోంది!

Money Horoscope New Year 2024: అన్ని గ్రహాలు ఎదో ఒక సమయంలో తప్పకుండా సంచారం చేస్తాయి. అయితే రాబోయే 2024 సంవత్సరంలో కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2023, 08:51 AM IST
Rasi Phalalu: ఈ రాశులవారిపై 2024లో లక్ష్మీదేవి అనుగ్రహం..అదృష్టం వరించబోతోంది!

 

Add Zee News as a Preferred Source

Rasi Phalalu: ప్రతి కొత్త సంవత్సరంలో చాలామంది జీవితంలో ఆనందంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా బాగుండాలని కోరుకుంటారు. అయితే ఇవన్నీ జాతకంలోని గ్రహాల స్థితులు నక్షత్రాలపై ఆధారపడి ఉంటుంది. అతి త్వరలోనే రాబోయే 2024 సంవత్సరంలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి దీనికి కారణంగా కొందరి జాతకాలు గ్రహాల స్థితులు అనుకూలంగా మారి లక్ష్మీదేవి అనుగ్రహం లభించబోతోంది. అమ్మవారి అనుగ్రహం కారణంగా ఇంతకుముందు ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరం ఉపశమనం లభించబోతోంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్టం కూడా రెట్టింపు అవ్వబోతోంది. అయితే 2024 సంవత్సరంలో ఏయే రాశుల వారు అదృష్టవంతులు అవ్వబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
మేష రాశి వారికి 2024 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు భారీ పెట్టుబడును పెట్టబోతున్నారు. అంతేకాకుండా సోదరుల నుంచి సపోర్ట్ లభించి ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరిగి బట్టలతోపాటు ఇతర బహుమతులు కూడా పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్న వారు ఆఫీసులు మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

మిథున రాశి:
2024 సంవత్సరం మిథున రాశి వారికి లాభదాయకంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు ఆత్మవిశ్వాసం పొందుతారు. దీంతో పాటు వీరికి కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. అలాగే జీవిత భాగస్వామితో గడపడానికి ప్రయత్నిస్తారు. రాబోయే కొత్త సంవత్సరంలో ఉద్యోగాలు చేసేవారు కార్యాలయాలు మరే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారికి అధికారుల నుంచి సపోర్ట్‌ కూడా లభించి ఊహించని లాభాలు పొందుతారు. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

కన్యా రాశి:
కన్యా రాశి వారికి రాబోయే 2024 సంవత్సరం ఆర్థికంగా చాలా బాగుటుంది. దీంతో పాటు వీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల అన్ని పనులపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి కొత్త ఇల్లుతో పాటు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయాల్లో ఊహించని మార్పులు వస్తాయి. కుటుంబ జీవితం జీవితం గడుపుతున్నవారికి ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. 

ధనుస్సు రాశి:
రాబోయే కొత్త సంవత్సరంలో ధనుస్సు రాశివారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా రకాల లాభాలు చేకూరుతాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులు నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లవచ్చు. అంతేకాకుండా కొత్త దుస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News