Nag Panchami 2022: నాగ పంచమి ఎప్పుడు? ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి?

Nag Panchami Pujan Vidhi: హిందూ మతంలో నాగదేవత పూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నాగ పంచమి రోజున నాగదేవతను పూజించడం మరియు ఉపవాసం ఉండటం వల్ల నాగదేవత యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 2, 2022, 02:17 PM IST
Nag Panchami 2022: నాగ పంచమి ఎప్పుడు? ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి?

Nag Panchami 2022 Date: హిందూ మతం ప్రకారం, శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున నాగ పంచమి పండుగ (Nag Panchami 2022) జరుపుకుంటారు. పంచమి తిథికి అధిపతి నాగదేవత అని నమ్ముతారు. నాగ పంచమి రోజున పూజలతో పాటు పాములను పూజించే సంప్రదాయం ఉంది. పురాణ కాలం నుంచి పాములను దేవుళ్లలా పూజిస్తారు. దీని వల్ల పాములు కాటువేస్తాయనే భయం పోతుందని నమ్మకం. నాగ పంచమి విశిష్టత, వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

నాగ పంచమి తేదీ, శుభ సమయం: 
ఈసారి శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి ఆగస్టు 2వ తేదీన వస్తోంది. ఇది ఆగస్టు 02వ తేదీ ఉదయం 05:13 గంటలకు ప్రారంభమై... ఆగస్టు 03వ తేదీ ఉదయం 05:41 గంటలకు ముగుస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 2న నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం 5:43 గంటల నుండి ఉదయం 8:25 గంటల వరకు పూజా సమయం ప్రారంభమవుతుంది. 

నాగ పంచమి పూజా విధానం:
**మీరు నాగ పంచమి రోజున ఉపవాసం చేయండి. ఈ రోజున అన్నత్, వాసుకి, పద్మం, మహాపద్మ, తక్షక్, కులీర్, కర్కట్ మరియు శంఖం అనే అష్టనాగులను పూజించాలని హిందూ మతం చెబుతుంది. 
**నాగ పంచమి ఉపవాసం చతుర్థి తిథి నుండి ప్రారంభమవుతుంది. రోజంతా ఉపవాసం ఉండి..సాయంత్రం ఆహారం తీసుకోండి. 
**నాగదేవతను పూజించేటప్పుడు పసుపు, రోలి, బియ్యం మరియు పువ్వులు సమర్పించి పూజించండి. 
**నాగదేవతకు పూజ చేసిన తర్వాత పచ్చి పాలలో నెయ్యి, పంచదార కలిపి నాగదేవతకు సమర్పించాలి.
** పూజలు ముగిసిన తరువాత, నాగదేవతకు హారతి ఇవ్వండి. పూజ చేసేటప్పుడు, వీలైతే దక్షిణాభిముఖంగా ఉన్న పాముకి పాలు సమర్పించాలని గుర్తుంచుకోండి. పూజానంతరం నాగ పంచమి కథ చదివి వినండి.

నాగ పంచమి వ్రత ప్రాముఖ్యత:
ప్రాచీన కాలం నుంచి పామును దేవతగా భావించి పూజిస్తున్నారు. నాగ పంచమి రోజున అన్ని పాములను పూజిస్తారు. ఈ రోజు భక్తిశ్రద్ధలతో నాగదేవతను పూజించడం వల్ల పాము కాటేస్తుందనే భయం తగ్గుతుంది. ఈ రోజున పాముకి పాలతో స్నానం చేసి తినిపిస్తే పుణ్యం లభిస్తుంది. ఈ రోజు ఇంటి ప్రధాన ద్వారం పాము బొమ్మను ఉంచడం వల్ల భక్తులకు ఆ దేవతా అనుగ్రహం కలుగుతుంది. 

Also Read: Astrology tips: మీకు కష్టాలు వచ్చే ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G   

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News