Nag Panchami 2023 Date And Time: హిందూ సాంప్రదాయంలో నాగుల చవితికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ప్రతి సంవత్సరం శ్రావణ మాస శుక్ల పక్షం ఐదవ రోజున నాగ పంచమిని జరుపుకుంటారు. ఈ రోజు నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా శివుడికి ఎంతో ఇష్టమైన నాగు పామును కూడా ఈ రోజు పూజించడం సాంప్రదాయ బద్ధంగా వస్తోంది. ఈ రోజు కొంద మంది మహిళలు వ్రతాన్ని కూడా పాటిస్తారు. అయితే ఈ సంవత్సరం నాగుల పంచమిని ఏ తేదిలో జరుపుకోవాలో, ఏయే పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నాగుల చవితి తేదీ:
నాగుల చవితిని ఆగస్టు 21వ తేదిన జరుపుకోవాలి.
పంచమి తిథి ప్రారంభం: ఆగస్టు 21 ప్రారంభమై 12:21 గంటలకు ప్రారంభమవుతుంది.
ఆగస్టు 22 మధ్యాహ్నం 02:00 గంటలకు పంచమి తిథి ముగుస్తుంది.
Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు
నాగుల పంచమి ప్రాముఖ్యత:
కాలసర్ప దోషంతో బాధపడుతున్నవారు ఈ రోజు వ్రతాన్ని పాటించడం వల్ల సులభంగా విముక్తి కలుగుతుంది.
నాగదేవతకు పూజలు చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయి.
నాగదేవతకు పూజ విధానం:
నాగదేవతకు పూజ చేసేవారు తప్పకుండా ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది.
స్నానం చేసిన మీ ఇంట్లో ఉన్న చిన్న మందిరంలో దీపం వెలిగించాలి.
ఆ తర్వాత శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి.
మీ దగ్గర్లో ఉన్న నాగదేవతకు కూడా పాలతో పాటు తేనెతో అభిషేకం చేయాలి.
ఇలా చేసిన తర్వాత నాగదేవతకు ఇష్టమైన తీపి పదార్థాలను నైవేద్యంగా అందించాలి.
నాగ పంచమి వ్రతానికి కావాల్సిన పూజ సామగ్రి:
నాగ దేవత విగ్రహం లేదా ఫోటో, పువ్వులు, ఐదు పండ్లు, పాలు, రత్నాలు, బంగారం, వెండి, ఐదు పండ్లు, పెరుగు, స్వచ్ఛమైన దేశి నెయ్యి, పవిత్ర జలం, పంచ రసం, తేనె, గంగాజలం, పంచ బిల్వ మిఠాయి, తులసి ఆకులు, మందారపువ్వు, పచ్చి ఆవు పాలు, కర్పూరం, ధూపం, దీపం, దూది మొదలైనవి.
Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook