Nirjala Ekadashi 2023 Date: హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ తిథి రోజున మహా విష్ణువుకు భక్తితో పూజలు చేయడం ఆనవాయితిగా వస్తోంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..మొత్తం 24 ఏకాదశి తిథిలు ఉంటాయి. ఈ ఏకాదశుల్లోని అన్నిట్లో నిర్జల ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంటుంది. ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి 31 మే, బుధవారం రాబోతోంది. అయితే జ్యోతిష్య శాస్త్ర పెద్దలు ఈ ఏకాదశిని జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి సమయాల్లో శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలతో పాటు ఆర్థిక సమస్యలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నిర్జల ఏకాదశి శుభ సమయం:
హిందూ సంప్రదాయం ప్రకారం..ఏకాదశి తిథి మే 30న మధ్యాహ్నం 01:07 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే నెల మే 31న మధ్యాహ్నం 01:45 గంటలకు ముగుస్తుంది.
సర్వార్థ సిద్ధి యోగం:
ఈ నిర్జల ఏకాదశి రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతోంది. అయితే ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ యోగ సమయం ఉదయం 05.24 నుంచి 06.00 వరకు ఉంటుంది.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
నిర్జల ఏకాదశి ఉపవాస సమయం:
నిర్జల ఏకాదశి వ్రతం పాటించేవారు తప్పకుండా ఉపవాసాలు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వ్రతం చేసేవారు జూన్ 01వ తేదీ ఉదయం 05.24 నుంచి 08.10 గంటల వరకు ఉపవాసాలు పాటించవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
నిర్జల ఏకాదశి:
నిర్జల ఏకాదశి రోజు వ్రతాన్ని పాటించేవారు తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది. ఈ పూజా క్రమంలో తప్పకుండా విష్ణు మంత్రాన్ని పఠిస్తూ పూర్ణ క్రతువులతో పూజించాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు కుండలతో నీటిని దానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పాపాలు కూడా సులభంగా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
నిర్జల ఏకాదశి పూజా విధానం:
✾ ఈ వ్రతాన్ని పాటించేవారు తప్పకుండా భక్తి శ్రద్ధలతో, నియమాలతో పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
✾ నిర్జల ఏకాదశి రోజున వ్రతాన్ని పాటించేవారు తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేవాలి.
✾ ఆ తర్వాత తల స్నానం చేసి పూజా గదిలోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది.
✾ పూజా గదిలో మహావిష్ణువు ముందు దీపం వెలిగించాలి.
✾ ఈ క్రమంలో స్వామి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి.
✾ ఆ తర్వాత నిర్జల ఏకాదశి వ్రత కథ చదవాలి.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook