Palmistry: మీ అరచేతిపై ఆ గుర్తులు, రేఖలున్నాయా..ఉంటే మీది మహారాజయోగమే, డబ్బే డబ్బు

Palmistry: జ్యోతిష్యశాస్త్రంలో హస్తరేఖా శాస్త్రం కూడా విశేష ప్రాధాన్యత కలిగి ఉంది.  హస్తరేఖను బట్టి మనిషి వ్యక్తిత్వం, ఆచరణ గురించంి చాలావరకు అంచనా వేయవచ్చు. చేతిపై ఉన్న రేఖలు గుర్తుల్ని బట్టి హస్తరేఖ ఉంటుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 15, 2023, 07:10 AM IST
Palmistry: మీ అరచేతిపై ఆ గుర్తులు, రేఖలున్నాయా..ఉంటే మీది మహారాజయోగమే, డబ్బే డబ్బు

హాయిగా, మహరాజులా జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అదృష్టం తోడివ్వని కారణంగా ప్రతి ఒక్కరికీ ఇది సాధ్యం కాదు. ఈ క్రమంలో ఎవరి జాతకం ఎలా ఉంటుందనేది కుండలిని బట్టి, హస్తరేఖను పట్టి చెబుతుంటారు. ఆ వివరాలు మీ కోసం..

హస్తరేఖా శాస్త్రం ప్రకారం మనిషి జీవితంలో చాలా విషయాలు తెలుసుకోవచ్చు. చేతిలో ఏర్పడిన రేఖలు, చిహ్నాలతో మనిషి జీవితంలో ఏం రాసిపెట్టుందనేది అంచనా వేయవచ్చు. అరచేతిపై ఉండే వివిధ రకాల గుర్తులు, రేఖల ఆధారంగా ఆ మనిషి ఎలాంటి జీవితం గడపనున్నాడు, ఎలా ఉంటాడనేది అంచనా వేయవచ్చు. 

రాజయోగం

చేతి మధ్యంలో బాణం, తోరణం, శంఖం లేదా జెండా గుర్తులుంటే మనిషి జీవితంలో చాలావరకు సాధిస్తాడని చెబుతారు. జీవితంలో ఏది సాధించాలని అనుకుంటాడో అది సాధ్యమౌతుంది. ఏ విధమైన లోటుండదు. 

డబ్బులు

ఎవరైనా వ్యక్తి బొటనవేలుపై సరోవరం లేదా చేప గుర్తుంటే భారీగా డబ్బులు వచ్చిపడతాయని అర్ధం. ఇలాంటి వ్యక్తి సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తాడు. అతడి జీవితం రాజయోగంగా ఉంటుంది. వ్యాపారంలో అద్భుత లాభాలు ఆర్జిస్తాడు.

ఉన్నత పదవి

హస్తరేఖాశాస్త్రం ప్రకారం ఒకవేళ మీ అరచేతిలోని ఏదైనా రేఖ మణికట్టు నుంచి ఉంగరం వేలి కింది వరకూ ఉంటే..అలాంటి వ్యక్తులు ఉన్నత స్థానం వరకూ చేరుకుంటారని అంటారు. జీవితంలో అంతులేని డబ్బులు, గౌరవం సాధిస్తారు. వీరిపై ఎల్లప్పుడూ శనిదేవుడి కటాక్షం ఉంటుంది.

రాజకీయాలు

ఎవరైనా మనిషి చేతిపై హృదయరేఖ ప్రారంభంలో త్రిశూలం గుర్తుంటే అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో బాగా రాణిస్తారు. మంచి పదవులు సాధిస్తారు. వీరి జీవితంలో ఏ వస్తువుకూ లోటుండదు.

Also read: Hajj 2023 Registration Process: హజ్ యాత్రకు వెళ్లాలంటే ఏం చేయాలి ? ఎంత ఖర్చు అవుతుంది ? ఫుల్ డీటేల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News