Hajj 2023 Registration Process: హజ్ యాత్రకు వెళ్లాలంటే ఏం చేయాలి ? ఎంత ఖర్చు అవుతుంది ? ఫుల్ డీటేల్స్

Hajj 2023 Registration Process: ఇస్లాం సంప్రదాయం ప్రకారం అత్యంత పవిత్రంగా భావించే మక్కా మసీదును సందర్శించుకోవాలనే కోరిక చాలామంది ముస్లింలో ఉంటుంది. అయితే, మక్కాను దర్శించుకునేందుకు అవసరమైన హజ్ యాత్రకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అందుకు ఎవరి నుంచి అనుమతి తీసుకోవాలి అనే విషయంలో సమాచారం మాత్రం అందుబాటులో ఉండదు. అలాంటి వారి కోసమే హజ్ యాత్రపై ఈ వార్తా కథనం.   

Written by - Pavan | Last Updated : Jan 14, 2023, 08:19 PM IST

    భారత్ కోసం సౌది అరేబియా కేటాయించిన హజ్ 2023 కోటా

    హజ్ యాత్ర 2023 కోసం ఎలా నమోదు చేసుకోవాలి

    హజ్ 2023 యాత్రకు అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే..

Hajj 2023 Registration Process: హజ్ యాత్రకు వెళ్లాలంటే ఏం చేయాలి ? ఎంత ఖర్చు అవుతుంది ? ఫుల్ డీటేల్స్

Hajj 2023 Registration Process: హజ్ యాత్ర 2023 విషయమై సౌదీ అరేబియాతో భారత్ ఒక ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌కి సౌదీ అరేబియా 1,75,025 మంది హజ్ యాత్రను సందర్శించడానికి కోటాను కేటాయించింది.

హజ్ కమిటీ ఇండియా విభాగం తమ అధికారిక వెబ్‌సైట్ www.hajcommittee.gov.in లో త్వరలోనే హజ్ 2023 రిజిస్ట్రేషన్ అప్లికేషన్‌ను విడుదల చేయనుంది. ప్రతీ సంవత్సరం, దుల్ హిజ్జా మాసంలో ముస్లిం సోదరులు హజ్ పర్‌ఫామ్ చేస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్‌ ప్రకారం దుల్ హిజ్జా నెలతో సంవత్సరం ముగుస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఇలా హజ్ యాత్రను సందర్శించడాన్ని మే అరాఫా అని పిలుస్తారు. 

ప్రతీ సంవత్సరం తరహాలోనే, ఈ సంవత్సరం కూడా సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించేందుకు భారత్ నుంచి లక్షలాది మంది ముస్లింలు దరఖాస్తు చేసుకుంటారని అంచనాలు చెబుతున్నాయి. హజ్‌ యాత్రకు వెళ్లాలనుకునే ముస్లింలు ఆన్ లైన్ లో హజ్ 2023 దరఖాస్తు ఫారం ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

భారత్ కోసం సౌది అరేబియా కేటాయించిన హజ్ 2023 కోటా 
భారత్ నుంచి హజ్ యాత్ర కోసం మక్కాకు వెళ్లాలనుకునే వారి కోసం సౌదీ అరేబియా ఒక కోటాను కేటాయిస్తుంది. అలా ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం 1,75,025 మంది కోటాను కేటాయించింది.

హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు హజ్ మొబైల్ యాప్, హెల్త్ ఫెసిలిటీ - e-MASIHA, ఇ-లగేజ్ ప్రీ-ట్యాగింగ్ పద్ధతుల్లో డిజిటల్ సిస్టమ్‌తో లింక్ చేసుకునేలా డిజిటలైజ్ చేయడం జరిగింది. హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం ఈ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చారు.

హజ్ యాత్ర 2023 నమోదు ప్రక్రియ ఇలా ఉండనుంది..

స్టెప్ 1: హజ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు ముందుగా హజ్ కమిటి అధికారిక వెబ్‌సైట్‌ www.hajcommittee.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. 

స్టెప్ 2: అధికారిక వెబ్‌సైట్‌లో హాజ్ ఫారమ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, అప్లై అనే బటన్ నొక్కండి.

స్టెప్ 3: ఇప్పుడు, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 4: వెబ్‌సైట్‌లో అడిగిన వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను ఫిల్ చేయాల్సి ఉంటుంది.

స్టెప్ 5: దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, మొదటి పేరు, చివరి పేరు వంటి వివరాలను ఎంట్రీ చేయాలి.

స్టెప్ 6: పాస్‌వర్డ్‌ను ఎంచుకుని, పాస్‌వర్డ్‌ను మరొక్కసారి కన్ఫమ్ చేయాల్సి ఉంటుంది.

స్టెప్ 7: సెక్యురిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి

స్టెప్ 8: సబ్మిట్ డీటేల్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 9: రిజిస్టర్ చేసుకున్న తరువాత, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి సిస్టమ్-జనరేటెడ్ ఓటిపి వస్తుంది.

స్టెప్ 10: మొబైల్ నెంబర్‌కి వచ్చిన OTP ని నమోదు చేసి, సబ్మిట్‌పై క్లిక్ చేయడం ద్వారా యూజర్ ఐడి యాక్టివేట్ అవుతుంది.

హజ్ 2023 యాత్రకు అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే..
పాస్‌పోర్ట్
బ్యాంకు ఖాతా
మొబైల్ నెంబర్
ఆధార్ కార్డ్
హజ్ 2023 యాత్రికుల వయో పరిమితి: హజ్ యాత్రకు వెళ్లడానికి ఒక నిర్దిష్టమైన వయోపరిమితి అంటూ ఏదీ లేదు.

ఇండియా నుండి హజ్ 2023 యాత్రకు వెళ్లేందుకు అయ్యే ఖర్చు..
యాత్రికుల అవసరాలనుబట్టి హజ్ కమిటీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. ఆ వివరాలన్నీ హజ్ కమిటి అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి.

Trending News