Pushya masam significance: సాధారణంగా మాసాలన్నింటిలోను కార్తీకం, భాద్రపదం, శ్రావణం, ధనుర్మాసం, అశ్వయుజం, పుష్య మాసాలను ప్రధాన మైనవిగా చెప్తుంటారు. కార్తీకమాసం.. శివకేశవులకు, భాద్రపదం వినాయకుడికి, ధనుర్మాసం.. విష్ణుభగవానుడికి ఎంతో ఇష్టమైన మాసాలుగా చెప్తుంటారు. అదే విధంగా పుష్య మాసం.. శనీశ్వరుడికి ప్రీతీకరమైన మాసంఅని చెప్తుంటారు. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసంను పుష్యమాసంగా చెప్తుంటారంట.ఈ మాసంలో ముఖ్యంగా శనీశ్వరుడి ఆరాధన, సూర్యరాధన ముఖ్యమని చెప్తుంటారు.
ఈ నెలలో చేసే ప్రతి దేవద కార్యాలు కూడా వందరెట్లు అధిక ఫలితాలను ఇస్తాయంట. అందుకే జపాలు, హోమాలు, ధ్యాన పారాయణాలు చేయాలని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఏలీనాటి, సాడేసాతి దోషాలున్న వారు శనీశ్వరుడ్ని కోలుచుకుంటే ఆ దోషాలన్ని దూరం చేస్తాడం. అదే విధంగా పుష్యమి శనీశ్వరుడి జన్మతిథి అంట. అందుకే ఈ మాసంలో శనీశ్వరుడి కోసం ఏరకమైన జపాలు, పూజలు చేసినకూడా ఆయన అమితంగా ఆనంద పడతారంట.
శనీశ్వరుడి ప్రీతీకొరకు తైలాభిషేకం, నల్ల నువ్వుల దానం, బెల్లం దానం, నల్లని కుక్కకు చపాతీలు మొదలైనవి పెట్టాలని పండితులు చెబుతుంటారు. ప్రతి ఆదివారం సూర్యరాధన చేయాలని కూడా పండితులు చెప్తున్నారు. శివుడ్ని, ఆంజనేయ స్వామిని సైతం..ఈ మాసంలో ఆరాధిస్తే మంచి జరుగుతుందంట. ఈమాసంలో.. ప్రతి పండగను కూడా ఎంతో వేడుకగా నిర్వహిస్తారు.
భోగి, సంక్రాంతి, కనుమలు కూడా అందరు ఎంతో పవిత్రంగా చేసుకుంటారు. అదే విధంగా రథ సప్తమి, వసంతపంచమిలను కూడా ఎంతో వేడుకగా చేసుకుంటారు. ఈ మాసంలో ప్రతి ఆదివారం.. నువ్వులు, బెల్లంల లడ్డులను దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం తినాలి.
Read more: ShaniDev: శనిదేవుడికి.. శనీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది..?.. ఈ పురాణ కథ మీకు తెలుసా..?
ఇలా చేస్తే.. ఆ శనీశ్వరుడి అనుగ్రహాం వల్ల మనకుఉన్న దోషాలు పోయి.. అంత శుభం కల్గుతుందని పండితులు చెబుతున్నారు. అయితే.. పుష్యమాసంలో మాత్రం చాలా వరకు పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు మాత్రం పెట్టుకొరు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter