Rahu And Ketu: తులారాశిలో చంద్ర గ్రహం, ఈ రాశులవారిపై రాహు-కేతు చెడు ప్రభావం!

Rahu And Ketu: తులారాశిలో చంద్ర గ్రహం సంచారం చేయడం వల్ల పలు రాశులవారిపై రాహు కేతు ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 25, 2023, 08:42 AM IST
Rahu And Ketu: తులారాశిలో చంద్ర గ్రహం, ఈ రాశులవారిపై రాహు-కేతు చెడు ప్రభావం!

Rahu And Ketu: చంద్రగ్రహం మే 31 తులారాశిలో సంచారం చేయబోతోంది. ఈ గ్రహం తుల రాశిలో జూన్‌ 3 మధ్యాహ్నం 12:28 వరకు అలాగే ఉంటాడు. బృహస్పతిపై చంద్రుని ప్రభావం పడబోతోంది. కాబట్టి ఈ క్రమంలో  గజకేసరి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రభావం వల్ల చాలా రాశులవారికి అదృష్ట కలుగడమేకాకుండా..చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభావం మేషరాశిపై కూడా పడుతుంది. కాబట్టి రాహు-కేతు అక్షంలో గజకేసరి యోగం ఏర్పడడంతో ఈ రాశులవారికి ప్రతికూల ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై ప్రభావం:
మేష రాశి:

మేష రాశివారికి బృహస్పతి గ్రహం మొదటి స్థానంలో రాహువుతో కలవబోతోంది. కాబట్టి ఈ క్రమంలో మేషరాశివారు చురుకుగా తయారవుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు  ఉన్నత జ్ఞానాన్ని పొందుతారు. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైవాహిక జీవితంలో కూడా చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సహనంతో ఉండడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ రాశివారు పలు జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. 

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి నాల్గవ దశమి అక్షాంశంలో యోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ క్రమంలో కేతువు చంద్రునితో 4వ స్థానం, రాహువు బృహస్పతితో 10వ స్థానంలో సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో కర్కాటక రాశివారు అపారమైన వృత్తిపరమైన విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగ జీవితంలో పలు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఉద్యోగాన్ని వదిలిలేసే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా కుటుంబంలో కూడా తీవ్ర సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల తెలపుతున్నారు. 

తుల రాశి:
తులారాశి వారికి గజకేసరి యోగం మొదటి, సప్తమ అక్షాంశ స్థానంలో సంచారం జరగబోతోంది. ఇదే క్రమంలో చంద్రుడు మొదటి స్థానంలో కేతువు, బృహస్పతి ఏడవ స్థానంలో  రాహువును కలుస్తున్నాయి. కాబట్టి ఈ రాశివారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అంతేకాకుండా ఖర్చులు పెరిగి, నష్టాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల వివాహం జరిగిన వివాహిత జంటల మధ్య విభేదాల కూడా కలుగుతాయి. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News