Rahu Mangal Yuti Make Angarak Yog 2022: శని తర్వాత నెమ్మదిగా కదలే గ్రహాలు రాహు మరియు కేతు. ఇవి ఏడాదిన్నరకు ఒకసారి తమ రాశిని మారుస్తుంటాయి. ఈ సంవత్సరం రాహువు ఏప్రిల్ 12న మేషరాశిలో సంచరించాడు. జూన్ నెలలో కుజుడు కూడా మేషరాశిలోకి ప్రవేశించాడు. ఈ రెండు కలిసి (Rahu Mangal Yuti) మేషరాశిలో అంగారక యోగాన్ని ఏర్పరిచాయి. ఆస్ట్రాలజీ ప్రకారం,అంగారక యోగాన్ని (Angarak Yog 2022) అశుభంగా భావిస్తారు. అయితే రానున్న కాలంలో ఈ యోగం మరింత ప్రమాదకరంగా మారనుంది.
మేషరాశిలో రాహువు, కుజుడు దగ్గరవుతున్నందున అంగారక యోగ బలం పెరుగుతోంది. ఆగష్టు 1 నుండి ఆగస్ట్ 4 మధ్య రాహువు మేషరాశిలో 24.7 డిగ్రీల వద్ద మరియు కుజుడు 24 డిగ్రీల వద్ద సంచరిస్తాడు, అప్పుడు రాహు-అంగారకుడు కలయికకు అత్యంత కష్టకాలం ఉంటుంది. దీని తరువాత, ఆగష్టు 11, 2022 న కుజుడు మేషం నుండి బయలుదేరతాడు.అయితే ఈ 4 రోజుల సమయం కొంతమందికి చాలా కష్టంగా మారనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశులకు కష్టకాలం
మేషం (Aries) - ఈ రాశిలోనే అంగారక యోగం ఏర్పడుతోంది కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి. ఇతరలుతో మర్యాదగా నడుచుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు గాయం కూడా కావచ్చు. బీపీ, మైగ్రేన్ ఉన్న రోగులు జాగ్రత్తగా ఉండాలి.
తుల (Libra)- ఈ రాశివారి వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో పొరపాటున కూడా గొడవలు పడకండి. ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు. ఇంటి పుడ్ తినడానికే ప్రాధాన్యత ఇవ్వండి.
వృషభం (Taurus)- ఈ రాశివారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో ఓపికగా పని చేయడం మంచిది.
మిథునరాశి (Gemini)- మిధున రాశి వారు తమ సోదరుడితో వివాదాలు పెట్టుకోకూడదు. లేకపోతే సంబంధం చెడిపోవచ్చు. చేతికి గాయం అయ్యే అవకాశం ఉంది.
కర్కాటకం (Cancer)- కర్కాటక రాశి వారి కోపాన్ని నియంత్రించుకోండి. ముఖ్యంగా ఆఫీస్ లో కోద్రాన్ని అదుపులో ఉంచుకోండి.
Also Read: Saturn transit effect: శనిగ్రహ సంచారం... త్వరలో మారనున్న ఈ 3 రాశుల అదృష్టం..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook