Rahu Vakri 2023: కొత్త సంవత్సరంలో మీనరాశిలోకి రాహువు... ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Rahu Vakri 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, రాహు గ్రహం మీన రాశిలో సంచరించబోతోంది. రాహు సంచారం వల్ల మూడు రాశులవారు బెనిఫిట్స్ పొందుతారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 11:10 AM IST
  • రాహువును ఛాయా గ్రహంగా అంటారు.
  • కొత్త ఏడాదిలో మేషం నుండి మీనరాశికి రాహువు
  • ఈ రాశులకు అదృష్ట యోగం
Rahu Vakri 2023: కొత్త సంవత్సరంలో మీనరాశిలోకి రాహువు... ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Rahu Planet Vakri In Pisces 2023: ఆస్ట్రాలజీలో రాహువును ఛాయా గ్రహంగా భావిస్తారు. మీ జాతకంలో రాహువు అశుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. కుండలిలో రాహు శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ మరియు లాటరీల్లో మంచి డబ్బు సంపాదిస్తారు. 2023 సంవత్సరంలో రాహు మేష రాశి నుండి మీనరాశిలోకి తిరోగమనం చేయబోతున్నాడు. దీని ప్రభావం (Rahu Gochar 2023) అన్ని రాశులవారిపై ఉంటుంది. ఈ రాహు సంచారం మూడు రాశులవారికి కెరీర్ లో పురోగతిని, వ్యాపారంలో లాభాన్ని సాధిస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మిథునం (Gemini): రాహు గ్రహ సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే రాహు గ్రహం మీ జాతకం యెుక్క 11వ ఇంట్లో సంచరించబోతోంది. దీంతో మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుండి లాభం పొందుతారు. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. కొత్త సంవత్సరంలో మీ వ్యాపారం పెరుగుతుంది. కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ కు అవకాశాలు ఉన్నాయి. 

కర్కాటకం (Cancer): రాహువు సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి పదో ఇంట్లో జరగబోతోంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం విస్తరిస్తుంది. అయితే రాహు ప్రభావం వల్ల మీరు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆఫీసులో మీ సహచరుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. 

కుంభం (Aquarius): రాహువు సంచారం వృత్తి మరియు వ్యాపార పరంగా మీకు లాభాలను ఇస్తుంది. ఎందుకంటే రాహు గ్రహం మీ సంచార జాతకంలో మూడవ ఇంట్లో సంచరించబోతున్నాడు. విదేశాలకు సంబంధించిన వ్యాపారులు లాభపడతారు. ఈరాశికి అధిపతి శనిదేవుడు. పైగా రాహు, శని ఇద్దరూ మిత్రులు. దీని కారణంగా రాహు సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది.

Also Read: Paush Amavasya 2022: పుష్య అమావాస్య ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News