Rahu Transit into Aries 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 12న రాహువు వృషభ రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 30, 2023 వరకు రాహువు మేష రాశిలోనే ఉండనున్నాడు. రాహువును జ్యోతిష్య శాస్త్రంలో షాడో ప్లానెట్‌గా పరిగణిస్తారు. రాహువు సంచారం పలు రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. వాటి చెడు ప్రభావం ఆయా రాశుల వారి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. అదే సమయంలో రాహువు సంచారం కొన్ని రాశుల వారికి బాగా కలిసొస్తుంది. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
రాహు సంచారం ఈ రాశుల వారికి శుభప్రదం :
మిథునరాశి: రాహువు సంచారం మిథున రాశి వారికి అనేక శుభాలను కలిగిస్తుంది. కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. ఆర్థిక స్థితికి పెద్ద ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. డబ్బు సంపాదనకు కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న వారికి ఇది గోల్డెన్ టైమ్‌గా చెప్పొచ్చు. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతారు.
కర్కాటకం: కర్కాటక రాశి వారిపై రాహు సంచారం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది. ప్రస్తుత ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారవచ్చు. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఇల్లు-కారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
మీనం: రాహువు సంచారం మీన రాశి వారికి కూడా ఆర్థికంగా కలిసొస్తుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. చేపట్టిన ప్రతీ పనిలో పురోగతి ఉంటుంది. సంపాదన పెరుగుతుంది. రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి లేదా ఉన్నత స్థానానికి చేరాలనుకునేవారి కల నెరవేరుతుంది. ఈ కాలంలో ప్రతీది వీరికి ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, ఊహలపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Shehnaaz Gill: సల్మాన్‌తో అంతలా రాసుకుని, పూసుకుని.. తాగిందా లేక... ఆ నటిపై విపరీతమైన ట్రోలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.