Rahuvu transit 2022: రాహు మేషరాశిలో ప్రవేశం, ఆ మూడు రాశులకు ఏడాది వరకూ అంతులేని సంపదే

Rahuvu transit 2022: జ్యోతిష్యశాస్త్రంలో రాహువు స్థానానికి చాలా ప్రాధాన్యత ఉంది. రాహువు గోచారం కారణంగా ఏడాదిపాటు ఆ మూడు రాశులవారికి ఒకేసారి డబ్బు, కీర్తి లభించనున్నాయి. ఆ మూడు రాశులేంటో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 28, 2022, 03:18 PM IST
Rahuvu transit 2022: రాహు మేషరాశిలో ప్రవేశం, ఆ మూడు రాశులకు ఏడాది వరకూ అంతులేని సంపదే

Rahuvu transit 2022: జ్యోతిష్యశాస్త్రంలో రాహువు స్థానానికి చాలా ప్రాధాన్యత ఉంది. రాహువు గోచారం కారణంగా ఏడాదిపాటు ఆ మూడు రాశులవారికి ఒకేసారి డబ్బు, కీర్తి లభించనున్నాయి. ఆ మూడు రాశులేంటో తెలుసుకుందాం.

రాహువు మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఏడాది వరకూ ఇదే రాశిలో ఉండనున్నాడు. రాహువు స్థానచలనం కారణంగా 3 రాశుల జాతకాలపై ఎనలేని ప్రభావం పడనుంది. శని గ్రహం తరువాత అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం రాహువు. ఏడాదిన్నరకాలం రాహువు మేషరాశిలో ఉంటాడు. 2023 అక్టోబర్ 30 వరకూ రాహువు ఇదే రాశిలో ఉండనున్నాడు. రాహు కేతువులు ఎప్పుడూ వక్రమార్గంలోనే పయనిస్తాయి. రాహువు అంటేనే ప్రజలు ఓ విధమైన భయానికి లోనవుతుంటారు. కానీ మేషరాశిలో ప్రవేశించిన కారణంగా 3 రాశులవారికి అంతులేని లాభాలు కలగనున్నాయి.

మూడు రాశులపై కరుణించనున్న రాహువు

రాహువు గోచారం మిధునరాశివారికి చాలా మంచిది. ఈ జాతకం వారికి 2023 అక్టోబర్ వరకూ అంతులేని డబ్బు లభించనుంది. ఊహించని సంపద లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సాఫల్యం ఉంటుంది. ప్రత్యేకించి వ్యాపారులకు చాలా అనువైన సమయం. పెట్టుబడులకు మంచి సమయం. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులతో లాభాలుంటాయి. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది.

కర్కాటకరాశివారికి రాహువు రాశి మారడమనేది ఓ వరం లాంటిది. ఉద్యోగ మార్పు ఉంటుంది. పదోన్నతి, ఇంక్రిమెంట్లు లాభిస్తాయి. వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి 2023 అక్టోబర్ వరకూ అనువైన సమయం. అంతులేని ధనలాభముండటంతో..ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పండితుల సూచన మేరకు సరైన ముత్యం ధరిస్తే అంతా అనుకూలమే.

మీనరాశివారికి రాహువు స్థానచలనం పెద్దఎత్తున డబ్బు తెచ్చిపెడుతుంది. అకస్మాత్తుగా డబ్బులు వస్తాయి. దాంతోపాటు ధనలాభం కూడా ఉంటుంది. చాలా మార్గాల్లో డబ్బులు వచ్చిపడటం వల్ల ఆర్ధికంగా బాగుంటుంది. అంతేకాకుండా..ఉద్యోగ, వ్యాపారాల్లో సాఫల్యం లభిస్తుంది. 

Also read: Puja Path Rules: దేవుడి ముందు దీపం వెలిగించడంలో ఈ తప్పులు చేస్తే... భారీ మెుత్తంలో డబ్బును కోల్పోతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News