Raksha Bandhan 2023: రాఖీ పండగ రోజు చేయకూడని తప్పులు ఇవే..మీరు కూడా ఇలా రాఖీ కడుతున్నారా?

Raksha Bandhan 2023: రాఖీ పండగను జరుపుకోవాలనుకునేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలను ఈ రోజు మీ తెలియజేయబోతున్నాం. రాఖీని సుభ సమయాల్లో మాత్రమే కాట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఏయే సమయాల్లో కట్టాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2023, 03:53 PM IST
Raksha Bandhan 2023: రాఖీ పండగ రోజు చేయకూడని తప్పులు ఇవే..మీరు కూడా ఇలా రాఖీ కడుతున్నారా?

 

Raksha Bandhan 2023: భారతదేశంలో రాఖీ పండగకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. రాఖీ పండగ రోజున సోదరీమణులు తమ సోదరుడి రాఖీని కట్టి బంధాన్ని మరింత బలపరుచుకుంటారు. రాఖీని కొన్ని రాష్ట్రాల్లో రక్షా బంధన్ పండుగ అని కూడా అంటారు. అయితే ఈ ఏడాది రక్షా బంధన్‌ రోజు 700 ఏళ్ల తర్వాత పంచ మహాయోగం ఏర్పడబోతోంది. దీంతో పాటు భద్ర కాలం కూడా ఏర్పడబోతోంది. కాబట్టి ఈ సంవత్సరం పౌర్ణమి రెండు రోజులు వచ్చింది. ప్రస్తుతం చాలా మంది రాఖీని ఈ రోజు కట్టాలో, రేపు కట్టాల్లో తెలియక తికమక పడుతున్నారు. ఇంతకీ రాఖీ పండన ఏ రోజు జరుపుకోవాలో..ఏయే సమయాల్లో రాఖీ కట్టడం వల్ల సోదరులకు దీర్ఘాయుష్షు లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

భద్రకాలం ఎప్పుడంటే?:
ప్రతి సంవత్సరం రాఖీ పండగను శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం రెండు రోజుల పాటు పౌర్ణమి ఉండడంతో చాలా మంది తికమక పడుతున్నారు.  ఆగస్టు 30 బుధవారం రోజున ఉదయం 10:58 గంటల నుంచి రాత్రి 9:01 గంటల వరకు భద్ర సమయం ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టడం అశుభమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. రాఖీ కట్టాలనుకునేవారు ఆగస్టు 30వ తేదీ 09:01 తర్వాత మాత్రమే రాఖీని కట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

ఆగస్టు 31న రోజంతా రాఖీ పండగను జరుపుకోవచ్చా?:
భద్ర కాలం ముగిసిన తర్వాత ఆగస్టు 31న రాఖీ పండగను జరుపుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు కూడా మంచి సమయాల్లో రాఖీ కట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం ఉదయం 7:05 వరకు మాత్రమే..ఎందుకంటే ఈ రోజు ఉదయం 07.05 గంటల వరకు మాత్రమే ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

ఇలా మాత్రమే రాఖీని కట్టాలి:
✽ ముందుగా ఎరుపు రంగు రాఖీని తీసుకుని దేవుడి దగ్గర పూజ చేయాల్సి ఉంటుంది.
✽ ఆ తర్వాత మీ సోదరుడిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి.
✽ రాఖీ కట్టే ముందు సోదరుడి భూజాలపై కటన్‌ తువాలను వేయాలి. 
✽ ఆ తర్వాత సోదరుని నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేయాలి. 
✽ అక్షింతలు వేసి కుడి చేతికి రాఖీని కట్టాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News